India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో 3 రోజులుగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు దూసుకొస్తున్నాయి. సూరాడ పేట, మాయాపట్నంలో గతంలో వేసిన జియో ట్యూబ్ గట్టు పూర్తిగా ధ్వంసం కావడంతో సముద్రపు నీరు ఇళ్లలోకి చొచ్చుకు వచ్చింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో తాగునీటి ప్లాంట్లు చిన్నాపెద్దా కలిపి 3,700 వరకు ఉండగా.. ఏటా రూ.20 కోట్లకు పైనే వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. తూ.గో జిల్లాలో 8, కాకినాడ-11, కోనసీమలో 9 మాత్రమే గుర్తింపు పొందిన ప్లాంట్లు ఉన్నాయి. నియంత్రణ, నీటి నాణ్యతను పట్టించుకునే వారు లేక ప్రజారోగ్యం సమస్యల్లో పడుతోంది. 2020-24 వరకు అధికారులు 56 చోట్ల నీటి నమూనాలు సేకరించగా.. 29చోట్ల నాణ్యత, బ్రాండింగ్ లోపాలు గుర్తించారు.
చెల్లని పోస్టల్ బ్యాలెట్, నోటా ఓట్లపై ఉమ్మడి తూ.గో జిల్లాలోని ప్రధాన అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది. కాకినాడ జిల్లాలో చూస్తే 2019లో నోటా, చెల్లని పోస్టల్ ఓట్ల వివరాలు వరుసగా ఇలా..
☞ పిఠాపురం-2339, 271
☞ కాకినాడ సిటీ-1654, 15
☞ కాకినాడ గ్రామీణ-1575, 868
☞ తుని-2586, 178
☞ ప్రత్తిపాడు-2079, 117
☞ పెద్దాపురం-2072, 206
☞ జగ్గంపేట-3016, 163
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశామని జగ్గంపేట ఎంపీడీవో వసంత్ కుమార్ తెలిపారు. జగ్గంపేట ఫీల్డ్ అసిస్టెంట్ గొల్లపల్లి రత్నరాజు, సీనియర్ మేట్ రెడ్డి భానుప్రతాప్ ఎన్నికల కోడ్ అతిక్రమించి వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆర్వోకు ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై డ్వామా అధికారులకు నివేదిక పంపించగా.. ఆ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం హైవేపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ <<13321598>>ప్రైవేట్ బస్సు కారును<<>> ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి అందులోనే ఇరుక్కుపోయాడు. ఇతర వాహనదారులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలకు మరో వారమే ఉండగా.. పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్స్’ ట్రెండ్ నడుస్తోంది. ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు నేమ్ ప్లేట్స్ చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘డిప్యూటీ CM వంగా గీత’ అంటూ ఓ కారుపై రాసి ఉన్న ఫొటోను వైసీపీ నేతలు, కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఎవరి కాన్ఫిడెంట్‌లో వారున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 25 మండలాల్లో సోమవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లాలోని 17 మండలాలు, కాకినాడ జిల్లాలోని 6 మండలాలు, డాక్టర్.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు.
– SHARE IT
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత గోలి వెంకటరావు ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఈయనది సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేశారు. వెంకట్రావు కుమారుడు గోలి శ్రీరామ్ గ్రామ ఉపసర్పంచ్‌గా కొనసాగుతున్నారు.
పిఠాపురంలో వంగా గీతదే విజయమని, 6640 ఓట్ల మెజారిటీ వస్తుందంటూ అంచనా వేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే..నియోజకవర్గంలో మొత్తం 2,38,000 ఓటర్లు ఉండగా.. 2,04,800 ఓట్లు పోలయ్యాయి. అందులో కులాల వారీగా వర్గీకరిస్తూ వంగా గీతకు 1,05,575 ఓట్లు, పవన్‌కు 98,935 ఓట్లు వస్తాయని లెక్కలేశారు. చివరగా దయచేసి బెట్టింగ్ కాయవద్దని ఓ ట్యాగ్‌లైన్ యాడ్ చేశారు.
– మరి ఈ లెక్కలపై మీ కామెంట్..?
‘పది’ సప్లిమెంటరీ హిందీ పరీక్షలో భాగంగా శనివారం తూ.గో జిల్లా కొవ్వూరు పరిధిలో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాలకు 80 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ముగ్గురు మాత్రమే వచ్చారు. PMMM స్కూల్‌లో 25 మందికి గానూ 1, ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 31 మందికి 1, బాలికోన్నత పాఠశాలలో 24 మందికి ఒకరు పరీక్ష రాశారు. ఈ ముగ్గురి కోసం 20 మంది టీచర్లు విధులు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.