India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన తొలి ఎరుకలి సామాజికవర్గ మహిళ సాతుపాటి ప్రసన్నశ్రీ. ప్రస్తుతం ఈమె రాజానగరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ విషయంపై CM చంద్రబాబు ‘X’ వేదికగా స్పందించారు. ప్రసన్నశ్రీ కథ ఆమె విశేషమైన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ఆమె ప్రయత్నాలకు తగిన గుర్తింపు రావడం సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు సంబంధిచిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించట్లేదని కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, మండలాల్లో జరిగే గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు.

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రాజమండ్రి రూరల్ రాజవోలు గ్రామానికి చెందిన సోడదాసి రమణ, కీర్తన దంపతుల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంది. పేద దంపతులు అయిన వీరు అప్పులు బారిన పడి సతమవుతున్న స్థితిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంతో ఎమ్మెల్యే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేసి నేడు చెక్కును అందజేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నర్సిపల్లి హారిక తదితరులు ఉన్నారు.

శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ. 13.78 లక్షలు అదనపు ఆదాయం సమకూరినట్లు రాజమండ్రి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె. షర్మిల అశోక ప్రకటించారు. తూ. గో జిల్లా ఆర్టీసీ రీజినల్ పరిధిలో రాజమండ్రి, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు డిపోల నుంచి మొత్తం 64 బస్సులు నడిపినట్లు చెప్పారు.

నేటి నుంచి న్యూ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి రానుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5 వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధిస్తామన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని కోరారు.

తూ.గో జిల్లాలో 51 కేంద్రాలలో 43,754 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలకు చెందిన వైసీపీ నేత, జెడ్పీటీసీ శామ్యూల్ టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ లంకా సత్యనారాయణ, శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, మాజీ సొసైటీ అధ్యక్షులు తూమపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. టీడీపీ విధానాలు నచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు.

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

విజయవాడ డివిజన్‌లోని కడియం ద్వారపూడి అనపర్తి రైల్వే స్టేషన్ మధ్య నాన్ ఎంటర్ లాకింగ్ పనులు నిమిత్తం మార్చి 1,2,3 తేదీల్లో గుంటూరు- విశాఖ- గుంటూరు (17239/17240 ) విశాఖ-లింగంపల్లి-విశాఖపట్నం నడిచే (12805/12806) రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ రైళ్లల్లో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు డబ్బు వాపస్ ఇస్తామని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.