India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాపు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తీర్మానించామన్నారు. అందుకు అనుగుణంగానే జేఏసీ నాయకులు కృషి చేసినట్లు వివరించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని బొబ్బర్లంక-పల్లంకుర్రు పంట కాలువలోకి శుక్రవారం ఉదయం ఓ డీసీఎం దూసుకెళ్లింది. చెరువులో పట్టిన చేపలు తరలించేందుకు వచ్చిన డీసీఎం వ్యాన్ అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు వ్యాన్‌పై మరొక యువకుడు ఉన్నట్టు సమాచారం. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
ఏఆర్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసులో పవన్, సత్య భవానీశంకరానికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 ఫైన్ విధిస్తూ కాకినాడ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి విజయబాబు గురువారం తీర్పునిచ్చారు. 2020లో కొండయ్యపాలానికి చెందిన సుబ్రహ్మణ్యం, పవన్, సత్య భవానీశంకరం అదే ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ బాలారెడ్డిపై చాక్‌తో దాడి చేశారు. టూ టౌన్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. మూడో నిందితుడు సుబ్రహ్మణ్యం మృతి చెందాడు.
రాజమండ్రిలోని బర్మాకాలనీకి చెందిన జొన్నపల్లి వీరబాబు(24) కుటుంబ కలహాల నేపథ్యంలో క్వారీ మార్కెట్ ప్రాంతంలో హోర్డింగుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రింగ్ మేస్త్రి వద్ద కూలి పనులు చేసుకునే అతను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో తగాదాల నేపథ్యంలో మద్యానికి బానిస అయ్యాడని త్రీ టౌన్ సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు. రెండంతస్తుల భవనంపై ఉన్న హోర్డింగుకు ఉరివేసుకొని మృతి చెందాడన్నారు.
రుతుపవనాలు ఈసారి సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందటంతో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైతులు ఈ నెల 25 నుంచి వరి ఆకుమడులు వేసే అవకాశం ఉంది. జిల్లాలోని 83,068 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటల సాగు జరగనుంది. వరి సాగుకు సంబంధించి సమారు 3,850 హెక్టార్లలో నారుమడులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15 నుంచి జూన్ 15లోపు నారుమడులు పూర్తి చేసి జూలై నుంచి నాట్లు వేయాల్సి ఉంది.
తూ.గో జిల్లాలో ఓట్ల లెక్కింపు నాడు కొవ్వూరు నియోజకవర్గ ఫలితం మొదట వెలువడనుంది. జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 116 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కొవ్వూరు-13 రౌండ్లు, నిడదవోలు-15, రాజానగరం-16, అనపర్తి-17, రాజమండ్రి సిటీ-17, రాజమండ్రి రూరల్-20, గోపాలపురం-18 రౌండ్లలో ముగియనుంది. ఒక్కో నియోజకవర్గానికి 14చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది.
ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డాక్టర్.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 24, 25వ తేదీల్లో జరగాల్సిన స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశామని జిల్లా సమన్వయ అధికారి వెంకట్రావు గురువారం తెలిపారు. తదుపరి తేదీలను పత్రికా ముఖంగా తెలియజేస్తామన్నారు. పేరెంట్స్, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు శివారులో యువకుడి డెడ్‌బాడీ కలకలం రేపింది. కైరం నాగశ్రీనివాస్(34) తన తండ్రి పోతురాజుతో పొలం పనులకు వెళ్తూ ఉంటాడు. గురువారం ఉదయం గ్రామ శివారున శ్రీనివాస్ స్పృహ లేకుండా పడి ఉండడం చూసి తండ్రి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అతడు చనిపోయినట్లు తెలపగా.. తండ్రి పోతురాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.శ్రీనివాస్ తెలిపారు.
కాకినాడ జిల్లా రౌతులపూడి శివారులో ఏలేరు ఎడమ కాలువలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన సీకోలు వీరబాబు అదే గ్రామానికి చెందిన పలువురితో కలిసి రౌతులపూడిలో ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఏలూరు ఎడమ కాలువలో స్నానానికి దిగగా.. వీరబాబు గల్లంతయ్యాడని దుర్గాడ గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.