EastGodavari

News May 23, 2024

తూ.గో: రేపు బాలికల క్రికెట్ జట్టుకు ఎంపికలు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రికెట్ మైదానంలో ఈ నెల 24న బాలికల అండర్-15, 19 సీనియర్స్ విభాగాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి సత్యనారాయణ బుధవారం తెలిపారు. అండర్ 15 జట్టుకు సెప్టెంబర్ ఒకటి 2009, అండర్ 19 జట్టుకు సెప్టెంబర్ ఒకటి 2005 తరువాత పుట్టిన వారు అర్హులన్నారు.

News May 23, 2024

కాకినాడ: ACB వలలో పరిశ్రమల శాఖ GM

image

ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ.మురళి బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ మురళి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

News May 23, 2024

నన్ను జైలులోనే చంపాలని చూశారు: రఘురామ

image

జగన్‌ చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైలులో పెట్టించి, అక్కడే చంపాలని చూశారని MP రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజునే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడే చనిపోయినట్లు భావించా. తెల్ల పేపర్‌పై సంతకం చేయాలని కస్టడీలో ముగ్గురు ముసుగులేసుకొని చిత్రహింసలకు గురి చేశారు. జగన్‌‌లో మార్పు రావాలనుకున్నా.. చివరికి ఆయన్నే మార్చాలన్నా ఆలోచన వచ్చింది’ అని అన్నారు.

News May 23, 2024

తూ.గో: ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్లు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశం కోసం ఈ నెల 25వ తేదీ శనివారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి వెంకట్రావు బుధవారం తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్‌లో ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. పదో తరగతిలో పొందిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన అర్హత కలిగిన బాలుర, బాలికలకు అడ్మిషన్లు కల్పిస్తామన్నారు.

News May 22, 2024

మూడంచెల భద్రతను పరిశీలించిన ఎస్పీ శ్రీధర్

image

కాట్రేనికోన మండలం చెయ్యేరులో శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘాను మరియు ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లను తనిఖీ చేశారు. ఇబ్బందికి తగు చూశాను అందించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా జిల్లాలో జూన్ 10 వరకు బాణాసంచా తయారీని నిషేధించామన్నారు.

News May 22, 2024

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దు.. కాకినాడ ఎస్పీ హెచ్చరిక

image

కాకినాడ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ సతీశ్ కుమార్ చెప్పారు. వివిధ పార్టీల నాయకులతో బుధవారం ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజున చిన్న చిన్న ఘటనలు జరిగాయని, లెక్కింపు సందర్భంగా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 22, 2024

కోనసీమ: నిండు ప్రాణాన్ని కాపాడిన హైవే సిబ్బంది

image

హైవే పెట్రోలింగ్ సిబ్బంది రావులపాలెం వైపు గస్తీ నిర్వహిస్తుండగా సిద్ధాంతం బ్రిడ్జిపై సుమారు 45 ఏళ్ల మహిళ గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించారు. గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రాజబాబు, దుర్గారావు, విజయ చందర్ వెంటనే చేరుకుని ఆ మహిళను అతి కష్టం మీద ఆపగలిగారు. ఆ మహిళను తమ వెంటబెట్టుకుని రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు బ్రిడ్జిపై జరిగిన సంఘటన వివరించారు.

News May 22, 2024

బాణసంచా విక్రయాలపై నిషేధం: కలెక్టర్‌

image

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు తూ.గో జిల్లాలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. జూన్‌ 4వ తేదీ కౌంటింగ్‌ జరగనున్నందున ఆ రోజు ఎక్కడా బాణసంచా కాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News May 22, 2024

పిఠాపురం: వీరమహిళల సేవలు మరువలేనివి: పవన్

image

జనసేన గెలుపు కోసం ప్రచారం చేసిన పార్టీ వీరమహిళల సేవలు మరువలేనివని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ లేక విడుదల చేశారు. ‘పిఠాపురంలో నా తరఫున ఆడపడుచులు చేసిన ప్రచారం, అందించిన తోడ్పాటుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రతిఒక్కరినీ గుర్తించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, వారిని బలమైన మహిళా నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాను’ అని పవన్ లేఖలో పేర్కొన్నారు.

News May 22, 2024

కోనసీమ: ACCIDENT.. పెరిగిన మృతుల సంఖ్య

image

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ధాన్యం లోడు చేస్తుండగా ఈనెల 14వ తేదీన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో గాయపడిన చిలకలపూడి సురేష్ (35) కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు అక్కడికక్కడే నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.