India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం రైలు నుంచి జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తుని రైల్వే ఎస్సై అబ్దుల్ మారూప్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నీలం రంగు జీన్స్ ప్యాంట్, గులాబీ రంగు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపర్చినట్లు తెలిపారు. సంబంధీకులు ఉంటే తుని రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సాయంత్రం పిడుగులు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, బిక్కవోలు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఫోన్లకు మెసేజ్‌లు పంపారు.
తుని పట్టణ రైల్వే స్టేషన్‌లో సోమవారం సినీ హీరో సాయిరాం శంకర్ సందడి చేశారు. నర్సీపట్నంకు చెందిన పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలో తుని రైల్వే స్టేషన్‌లో కనిపించారు. 143 చిత్రంతో పాటు పలు చిత్రాలలో ఆయన నటించారు. తుని రైల్వే స్టేషన్‌లో ఆయనను చూసి పలువురు సెల్ఫీలు దిగారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గోకవరం పంచాయతీ పరిధి గిరిజనాపురం గ్రామస్థులు తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో మొత్తం 50 మంది ఉండగా.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత 19మందికి తొలిసారి ఓటుహక్కు వచ్చింది. 12 కుటుంబాలకు చెందిన వీరు కొండదిగువన 4కి.మీ. దూరంలో వేములపాలెం పోలింగ్ బూత్‌లో ఓటేశారు. తమకు ఓటుహక్కు రావడంతో రాజకీయ నాయకులు సైతం తొలిసారి ప్రచారం చేశారని చెబుతున్నారు.
తూ.గో. జిల్లా అడ్డతీగల మండలం దగ్గర తిమ్మాపురం పంచాయతీ పరిధి గడిచిన్నంపాలేనికి సరైన రహదారి లేక గ్రామస్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామానికి చెందిన పెంటరావు అనారోగ్యంతో చికిత్సపొందుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని వాహనంలో తీసుకొద్దామంటే గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక ఎడ్లబండిలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
థాయిలాండ్‌లో ఆదివారం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. టైటిల్ ఫైట్లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-15, 21-15 స్కోరుతో చైనా క్రీడాకారులు చెన్-లు జంటపై గెలిచి రూ.26 లక్షల నగదు బహుమతితోపాటు ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారని సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథ్ తెలిపారు. కాగా సాత్విక్ సాయిరాజ్‌ది మన కోనసీమ జిల్లా అమలాపురం అన్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై EC దృష్టి సారించింది. హింసకు తావున్న ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించింది. దీంతో కౌంటింగ్‌కు ముందే ఇక్కడ కేంద్ర బలగాలతో పహారా కాయనున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద స్నానానికి దిగి ఓ బాలుడు మృతిచెందాడు. మృతుడు రాజమండ్రిలోని శాంతినగర్‌కు చెందిన దడాల దినేశ్(16)గా పోలీసులు గుర్తించారు. బొబ్బర్లంక బ్యారేజీ దిగువన గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడని తెలిపారు. ఈ వారంలో ఇదే గోదావరిలో గల్లంతై వాడపల్లి, రావులపాలెం వద్ద ఆరుగురు మృతి చెందగా.. ఇది ఏడవ మరణం.
నకిలీ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి అర్ధ నగ్నచిత్రాలు పంపిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశామని నిడదవోలు SI అప్పారావు ఆదివారం తెలిపారు. తూ.గో. జిల్లా సమిశ్రగూడేనికి చెందిన దుర్గాప్రసాద్ పట్టణంలోని ఓ వివాహిత పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి మరో మహిళ ఫోన్‌కు మహిళల అర్ధనగ్న చిత్రాలను మార్ఫింగ్ చేసి పంపించారు. వివాహితకు విషయం తెలియటంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.
మామిడి వ్యాపారులు కొంతమంది చట్టవిరుద్ధంగా కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి కాయలను కృత్రిమంగా పండించి మార్కెట్‌లో అమ్ముతున్నారని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు అన్నారు. ఆదివారం స్థానిక కన్స్యూమర్ వాయిస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అనంతరావు మాట్లాడారు. కాల్షియం కార్బైడ్ అనేది ప్రమాదకరమైన రసాయనమని, దాని వలన మనిషి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చిరించారు.
Sorry, no posts matched your criteria.