India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద గౌతమి గోదావరిలో శనివారం <<13271997>>గల్లంతైన ముగ్గురిలో<<>> మూడో మృతదేహం ఆదివారం లభ్యమైంది. సత్తి సంపత్‌రెడ్డి(16)గా గుర్తించారు. నిన్న గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన వారిలో పెంట జయకుమార్(19), సబ్బెల్ల ఈశ్వర్ రెడ్డి(20) మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో కపిలేశ్వరపురం మండలం తాతపూడి ఇసుక ర్యాంపు వద్ద సంపత్ రెడ్డి డెడ్‌బాడీ లభ్యమైంది.
వేసవి నేపథ్యంలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 08321, 08322, 08325, 08326 నంబర్లు గల రైళ్ళ సేవలను మే 30 నుంచి జూన్ 29వ తేదీ వరకూ పొడిగించింది. ఈ రైళ్లు ఉమ్మడి తూ.గో జిల్లాలోని తుని, పిఠాపురం, సామర్లకోట, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.
ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. మన MLA ఎవరనేది తేలిపోనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు గెలుపోటములు, మెజారిటీలపై పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం రూ.లక్షల్లో సాగుతుందని టాక్. మరోవైపు పలు పార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు.
– మరి మీ MLA ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?
HYDలోని బోరబండకు చెందిన నల్లమాటి సాయికుమార్(29)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఈ నెల 9న ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్య రాజమండ్రికి వెళ్లింది. కాగా 17వ తేదీన సాయికుమార్ భార్యకు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య మాటామాట పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుమేరకు బోరబండ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహం కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి పడేసినట్లు ఉంది. ఎవరో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నవరం సత్యదేవుడి కళ్యాణోత్సవాల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణ ధారణ, దీక్షా వస్త్రధారణ జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి మంగళ సూత్రాలు, చుట్లు, స్వామికి స్వర్ణ యజ్ఞోపవేతాలను మేళతాళాల మధ్య గ్రామంలో విశ్వబ్రాహ్మణుల నుంచి తీసుకు వస్తారు. రాత్రి 7 గంటలకు స్వామిని వెండి గరుడ వాహనంపై, అమ్మవారిని గజవాహనంపై, పెళ్లి పెద్దలైన సీతారాములను వెండి పల్లకీలో ఊరేగిస్తారు.
సత్య దేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్య కళ్యాణం ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానుంది. వీఐపీలు, భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో అలంకరణ చేయనున్నారు. కొండ దిగువ నుంచి కొండపైకి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట మధ్య ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్- వైజాగ్ వారియర్స్‌కు కాకినాడ జిల్లా క్రీడాకారుడు పెంకె మణికంఠ గంగాధర్ ఎంపికయ్యాడు. సామర్లకోటలోని వీరరాఘవపురానికి చెందిన గంగాధర్ క్రికెట్‌లో మంచి ఆటతీరు కనబర్చడంతో ప్రీమియర్ వైజాగ్ వారియర్స్‌కు ఎంపిక చేసినట్లు క్రికెట్ సంఘం నేతలు వివరించారు. మణికంఠ ఎంపిక పట్ల జిల్లా క్రీడా సంఘం అధ్యక్షులు శివకుమార్, కార్యదర్శి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గంగాధర్‌కు అభినందనలు తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం రావులపాలెం వద్ద గౌతమి గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరొక యువకుడు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టగా.. ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల నేపథ్యంలో తూ.గో కలెక్టర్ సూచనల మేరకు నన్నయ విశ్వవిద్యాలయంలో రోజువారి కార్యక్రమాలను జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు వీసీ కె.పద్మరాజు తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న కారణంగా క్యాంపస్‌ను ‘నో మ్యాన్ జోన్’గా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని వీసీ కోరారు.
Sorry, no posts matched your criteria.