India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర శనివారం ఉదయం ఆకాశంలో ఆహ్లాదకరమైన వాతావరణ దృశ్యం కనిపించింది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడ ఒక్కసారిగా మారిన వాతావరణం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆకాశంలో ఎరుపు వర్ణంతో మేఘాలు, కింద వరి పొలాలు కనువిందుగా దర్శనమిచ్చాయి. ఆ అందాలను భక్తులు సెల్‌ఫోన్లతో ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు.
కోడిగుడ్డు ధర పెరిగింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.7కు విక్రయం జరుగుతోంది. ప్రస్తుతం ధర పెరిగినప్పటికీ రైతుల నుంచి రూ.5కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 300 పౌల్ట్రీలు ఉన్నాయి. దాదాపు 1.40 కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుంది. రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కోడిగుడ్డుకు నికరంగా రూ.6 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజుల పాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ.రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. అయితే దీనిపై హైకోర్టు స్టే ఉన్నందున తదుపరి విచారణ జూన్ 21వ తేదీకి వాయిదా వేసింది. YS.జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన శ్రీనుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో శుక్రవారం ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కాకినాడ జేఎన్టీయూ ఉపకులపతి ప్రసాదరావు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 20,256 మంది పరీక్షకు హాజరుకాగా.. 1995 మంది గైర్హాజరు అయినట్టు తెలిపారు. కాకినాడ జిల్లాలో ఫార్మసీ విభాగానికి సంబంధించి 920 మంది విద్యార్థులు హాజరయ్యారు.
తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన నన్నయ విశ్వవిద్యాలయం నుంచి కిలోమీటర్ మేర 144 సెక్షన్ అమలుపరచడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
తూ.గో జిల్లా అనపర్తిలో నకిలీ నోట్ల చెలామణి కలకలం రేపింది. ఫేక్ నోట్స్ మార్కెట్‌లోకి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు నోట్లు, నకిలీ నోట్లు గుర్తించలేని విధంగా ఏ మాత్రం అనుమానం రాకుండా చేతులు మారుతున్నాయట. రూ.100, రూ.200, రూ.500 నకిలీ నోట్లు విపరీతంగా చెలామణి అవుతున్నాయని పలువురు వాపోతున్నారు. డబ్బు చూస్తేనే దుకాణదారులు భయపడుతున్నారు. బడ్డీ కొట్లు, చిన్న దుకాణదారులు వాటికి బలవుతున్నారు.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడులో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లమిల్లి సత్తిరాజు కుమారుడు కృష్ణప్రసాద్ HYDలో ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఓటింగ్ కోసం స్వగ్రామానికి వచ్చిన కృష్ణప్రసాద్.. ఈ రోజు మామిడికాయలు కోయడానికి చెట్టెక్కాడు. కాయలు కోస్తున్న క్రమంలో గుండెపోటు రాగా పైనుంచి రాయిపై పడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద 216వ నంబర్ జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడని ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన బర్రె నాగరాజు (21) బైక్‌పై రావులపాలెం నుంచి మూలస్థాన అగ్రహారం వైపు వస్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని రెండు నగరాల్లో ఓటర్ల చైతన్యంలో కాకినాడ ప్రథమ స్థానంలో నిలిచింది. కాకినాడలో అత్యధికంగా 72.16% పోలింగ్ జరిగింది. రాజమహేంద్రవరంలో 67.57% పోలింగ్ నమోదైంది. ఈ రెండు నగరాల్లో ఓటింగ్ శాతం గతం కంటే పెరిగింది. మరోవైపు 9 పట్టణాల్లో మండపేట, పిఠాపురం, నిడదవోలు ముందంజలో నిలిచాయి. మండపేటలో అధికంగా 85.72%, పిఠాపురంలో 83.48%, నిడదవోలులో 82.31% పోలింగ్ జరిగింది.
Sorry, no posts matched your criteria.