EastGodavari

News May 15, 2024

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు‌పై బెట్టింగులు

image

పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపుపై జోరుగా పందేలు కాస్తున్నారు. జరిగిన పోలింగ్‌ ఫలితాల్లో పవన్‌ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని పలువురు బెట్టింగ్ వేస్తున్నారు. పవన్‌ గెలిస్తే రూ.లక్ష చెల్లిస్తామని.. ఒకవేళ వైసీపీ అభ్యర్థి గీత విజయం సాధిస్తే రూ.2 లక్షలు చెల్లించాలని ఉమ్మడి పార్టీల నాయకులు చెల్లించాలన్న ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. దీనిపై మీ కామెంట్..

News May 15, 2024

తూ.గో.: బెట్టింగులు.. రాజకీయ విశ్లేషణలు

image

ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఇంకా విజేత ఎవరనేది తెలియాలంటే దాదాపు 20 రోజులు వేచిచూడాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి తూ.గో. జిల్లాలో పలు చోట్ల అభ్యర్థుల గెలుపు ఓటములపై బెట్టింగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఏ గ్రామంలో చూసినా యువత, పెద్దలు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. కాగా మన ఉమ్మడి తూ.గో.లో మొత్తం 19 నియోజకవర్గాలున్నాయి.
– ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందంటారు.

News May 14, 2024

తూ.గో.: జనసేన ఇన్‌ఛార్జి అరెస్ట్.. పవన్ స్పందన

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ అరెస్ట్ అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఓ లేఖ విడుదల చేశారు. YCP నాయకులే కవ్వింపు చర్యలకు పాల్పడిన సందర్భంలో చోటుచేసుకున్న వివాదంలో హత్యాయత్నం కేసు నమోదు చేయడం రాజకీయ కుట్రలో భాగంగా కనిపిస్తోందన్నారు. న్యాయపరంగా పోరాడతామని లేఖలో పేర్కొన్నారు. కాగా లీలాకృష్ణకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.

News May 14, 2024

అమలాపురంలో యువకుడిపై కత్తితో దాడి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని మొబార్లీపేట జంక్షన్ వద్ద మంగళవారం ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. దుండగులు యువకుడిని కత్తితో నరికి, నాప రాయితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కొనఊపిరితో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 14, 2024

ఓటు వేసి.. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయింది

image

కాకినాడలోని రేచర్లపేట 41వ పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చిన షేక్ అహ్మద్ హున్నీషా అనే మహిళ అస్వస్థతకు గురై మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం అహ్మద్ హున్నీషా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకొని 12.30కి ఓటు వేసింది. అనంతరం ఆయాసం వస్తుందంటూ చెప్పడంతో అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది ఆమెను ఆటోలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 14, 2024

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో యువకుడి కిడ్నాప్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంకలో ఓ యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. తన కుమారుడు రేఖపల్లి నాగరాజును కొందరు వ్యక్తులు సోమవారం కిడ్నాప్ చేశారని తండ్రి సూర్యనారాయణ మలికిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత వివాదాలే ఈ కిడ్నాప్‌కు కారణమని యువకుడి తండ్రి చెబుతున్నారు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చేపట్టారు.

News May 14, 2024

కోనసీమ: ఓటు వేశాక ఫిట్స్.. చికిత్స పొందుతూ మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన కర్రి సత్యనారాయణ(52) ఫిట్స్‌తో మృతి చెందాడు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఓటు వేసిన అనంతరం ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే సత్యనారాయణ మృతితో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది.

News May 14, 2024

తాజా అప్‌డేట్: ఉమ్మడి తూ.గో.లో అత్యధిక పోలింగ్ ఇక్కడే

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19% పోలింగ్ నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో 79.31%, కాకినాడ జిల్లాలో 76.37% నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. మండపేటలో అత్యధికంగా 87.50%, అత్యల్పంగా రాజమండ్రి సిటీలో 67.59% పోలింగ్ నమోదైంది.
NOTE: పూర్తి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చు.

News May 14, 2024

తూ.గో.: ఓట్ల పండగ ముగిసింది.. మీరు ఓటేశారా..?

image

ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఓట్ల పండగ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కాగా సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాలో 68.17, కోనసీమ జిల్లాలో 73.55, కాకినాడ జిల్లాలో 65.01 పోలింగ్ నమోదైంది. మరి మీరు ఓటు వేశారా..? మీ వద్ద ఎలా జరిగింది పోలింగ్..?
– కామెంట్ చేయండి.

News May 13, 2024

కాకినాడ: ఓటు వేసిన ఉప్పెన మూవీ డైరెక్టర్

image

కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉప్పెన మూవీ డైరెక్టర్ సానా బుచ్చిబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన స్వస్థలమైన కొత్తపల్లిలో ఓటు వేసినట్లు తెలిపారు. ఓటు హక్కును అందరూ విధిగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్ని పనులున్నా ఈ ఒక్కరోజు మాత్రం పక్కన పెట్టి ఓటు వేయాలని అన్నారు.