India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు మినహాయించి మిగతా ఎక్కడా ఎలాంటి అల్లర్లు లేవు. కాగా ఉదయం 9:00 గంటల వరకు తూ.గో జిల్లాలో 8.68 శాతం పోలింగ్ నమోదవగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10.42 శాతం, కాకినాడ జిల్లాలో 7.9 శాతం నమోదైంది. నియోజకవర్గాల్లో చూస్తే.. అత్యధికంగా రంపచోడవరంలో 12.59%, తక్కువగా అనపర్తిలో 6% నమోదైంది.
అనపర్తి- 6.00%, గోపాలపురం- 9.10%, కొవ్వూరు- 9.75%, నిడదవోలు- 6.20%, రాజమండ్రి సిటీ- 8.50%, రాజమండ్రి రూరల్- 11.0%, రాజానగరం- 9.85%, అమలాపురం- 12.05%, పి.గన్నవరం- 10.85%, కొత్తపేట- 8.35%, మండపేట- 12.00%, ముమ్మిడివరం- 8.26%, రంపచోడవరం- 12,59%, రాజోలు- 9.56%, జగ్గంపేట- 8.73%, కాకినాడ సిటీ- 10.21%, కాకినాడ రూరల్- 7.00%, పెద్దాపురం- 9.35%, పిఠాపురం- 10.02%, ప్రత్తిపాడు- 8.5%, తుని- 10.00%.
కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితి నెలకొందని ఓటర్లు మండిపడుతున్నారు. ఈవీఎంలలో గుర్తులు సరిగా కనిపించడం లేదని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో కనీసం విద్యుత్ సరఫరా లేదని వారు ఆరోపించారు.
ఏజెన్సీలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజవొమ్మంగి మండలంలోని 75, 76 పోలింగ్ కేంద్రాలలో ఇప్పటివరకు ఈవీఎంలు మోరాయించడంతో ప్రక్రియ ఆలస్యమైందని, ప్రస్తుతం ఈవీఎంలు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. కొన్ని నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని పోలింగ్ ఆఫీసర్లు వెల్లడించారు.
తూ.గో జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 16,23,149 మంది
☞ పోలింగ్ కేంద్రాలు- 1,577
☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 375
☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18904252540
☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం నంబర్- 1950
ఉమ్మడి తూ.గో జిల్లాలో 2014తో పోలిస్తే 2019లో పోలింగ్ శాతం పెరిగింది. 80% నమోదైంది. అత్యధికంగా అనపర్తిలో 87.48%, అతి తక్కువగా రాజమండ్రి సిటీలో 66.34% నమోదైంది. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పగడాలపేట ప్రాంతంలోని 109వ పోలింగ్ కేంద్రంలో 100% పోలింగ్ నమోదవ్వడం గమనార్హం. ఈసారి విదేశాలు, ఇతర పట్టణాల్లో ఉన్నవారు భారీగా తరలివస్తున్నారు. వారంతా ఓటువేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది.
తూ.గో జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 16,23,149 మంది
☞ పోలింగ్ కేంద్రాలు- 1,577
☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 375
☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18904252540
☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం నంబర్- 1950
కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పరిధిలోకి మగసానితిప్ప దీవిలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌కు ఎన్నికల సామగ్రిని అధికారులు మరపడవపై తరిలించారు. బలుసుతిప్ప నుంచి మగసానితిప్పకు చేరుకోవడానికి ఉప్పుటేరు వెంబడి గోదావరి నదీపాయలో గంటసేపు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో 3,608 బ్యాలెట్ యూనిట్లు, 3,608 కంట్రోల్ యూనిట్లు, 4002 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 3,860 బ్యాలెట్ యూనిట్లు, 3,860 కంట్రోల్ యూనిట్లు, 4,170 వీవీప్యాట్లు వాడుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,040 బ్యాలెట్ యూనిట్లు, 2,040 కంట్రోల్ యూనిట్లు, 2,203 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో ఆలస్యమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు వారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.