EastGodavari

News May 10, 2024

టార్గెట్ పిఠాపురం.. జగన్ ఫిన్షింగ్ టచ్..?

image

ఏపీలోనే పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ ఇక్కడ పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి ఓడిపోయారు. అదే రిజల్ట్ ఈసారి పిఠాపురంలోనూ రిపీట్ చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌కు మద్దతుగా సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుండగా.. సీఎం జగన్ తన ప్రచారాన్ని పిఠాపురంలో ముగించనున్నట్లు సమాచారం. సీఎం ఫిన్షింగ్ టచ్ ఇస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే భావనలో ఉన్నారట.

News May 10, 2024

రాజమండ్రి: మురుగు కాలవలో శిశువు మృతదేహం

image

అభం శుభం తెలియని శిశువు మృతదేహం మురుగు కాలువలో లభ్యం కావడం స్థానికులను కలచి వేసింది. రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆర్యాపురం ప్రధాన మురుగు కాలువలో మగ శిశువు మృతదేహం కనిపించడంతో పోలీసులు బయటకు తీయించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా బొడ్డుతాడు కూడా తీయని శిశువు మృతదేహాన్ని కాలువలో పడేశారని, దీనిపై విచారణ చేపట్టామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News May 10, 2024

తూ.గో: ఎన్నికలు, సెలవులు.. ఫుల్ రద్దీ

image

ఒక వైపు ఎన్నికలు.. మరొక వైపు సెలవులు కావడంతో ఆర్టీసీతో పాటు రైల్వేలలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉమ్మడి తూ.గో జిల్లాకు చెందిన వేల మంది హైదరాబాదులో ఉపాధి పొందుతున్నారు. అక్కడి నుంచి స్వస్థలాలకు వచ్చేందుకు రైల్వేతో పాటు ఆర్టీసీలోనూ టిక్కెట్లు దొరకని పరిస్థితి. ఈ నెల 11, 12, 13 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండనుంది. HYD నుంచి రాజమహేంద్రవరానికి నిత్యం 4 సర్వీసులు నడుస్తుండగా.. మరో 3 ఏర్పాటు చేశారు.

News May 10, 2024

పిఠాపురంలో పవన్ రోడ్ షో.. రూట్‌మ్యాప్ ఇలా

image

పిఠాపురం నియోజకవర్గంలో నేడు పవన్ రోడ్ షో ఇలా సాగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు చిత్రాడ-జగ్గయ్యచెరువు, పాదగయ, పశువుల సంత, గొల్లప్రోలు పట్టణం, చేబ్రోలు గెస్ట్‌హౌస్ వరకు రోడ్ షో సాగనుంది. సాయంత్రం ఏకే మల్లవరం, కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్, ఎస్‌ఈజెడ్ కాలనీ, కొత్తపల్లి, యండపల్లి, కొండెవరం, పిఠాపురం బంగారమ్మ రావిచెట్టు కూడలి వరకు ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.

News May 10, 2024

తూ.గో: పోలింగ్ పెంపుపై ప్రత్యేక శ్రద్ధ

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో రెండు నగరాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలున్నాయి . ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువ. అన్ని విధాలా చైతన్యం కలిగిన జిల్లా. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ పెద్దగా పోలింగ్ జరగడంలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 74.64శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2019లో 79శాతం పోలింగ్ జరిగింది. ఈ సారి కనీసం 85 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

News May 10, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రలోభాల పర్వం..?

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రలోభాలకు తెరలేచినట్లు తెలుస్తోంది. కొత్తపేటలో చీరలు, వెండి నాణేలు.. రాజమండ్రిలో ఓటుకు రూ.2,500.. కాకినాడ, పెద్దాపురం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తిలో రూ.2వేలు.. తుని, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజానగరం, పి.గన్నవరం, రాజోలులో రూ.1500.. జగ్గంపేటలో రూ.1000 చొప్పున ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో ఏకంగా రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పంచుతున్నట్లు తెలుస్తోంది.

News May 10, 2024

రాజమండ్రి: చంద్రబాబు కుట్రలకు మోసపోవద్దు: భరత్

image

మోసపు మాటలతో ప్రజలను నమ్మించి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు పన్నే కుట్రలకు ఎవరూ మోసపోవద్దని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని 2, 10వ వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు.
– భరత్ వ్యాఖ్యలపై మీరేమంటారు..?

News May 9, 2024

తూ.గో.: ప్రలోభాలు షురూ

image

ఎన్నికల పోలింగ్‌కు సమయం ముంచుకొస్తుండటంతో రాజకీయ నాయకులు  ఓటర్లను ఆకట్టుకోవడానికి తాయిలాలకు తెర లేపుతున్నారు. పగలు ప్రచారం చేసి రాత్రిళ్లు నగదు పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గాలను ఎంచుకొని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  – మీ వద్ద జరుగుతోందా..?

News May 9, 2024

పిఠాపురానికి రేపు పవన్.. ఎల్లుండి జగన్

image

ప్రచార గడువు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పిఠాపురంలో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ రోడ్‌షో చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. భారీ బహిరంగ సభ సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి పిఠాపురంలో ప్రచార ముగింపు సభ నిర్వహించనున్నారు.

News May 9, 2024

తూ.గో.: పిడుగులు పడతాయి జాగ్రత్త

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ, బిక్కవోలు, రాజమండ్రి ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు మెసే‌జ్‌లు పంపింది.