India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 20833/20834 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సామర్లకోట రైల్వేస్టేషన్లో హాల్ట్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వందేభారత్‌లో ప్రయాణించే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గురువారం రాత్రి ఒంటి గంటకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం 11.70 అడుగులకి చేరిందని అధికారులు తెలిపారు. సర్‌ప్లస్ (surplus) వాటర్ 9,86,016కి చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు ప్రకటించారు. ఈ మేరకు రివర్ కన్జర్వేటర్ & గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
వర్గీకరణపై సుప్రీం తీర్పును అంగీకరించబోమని అమలాపురం మాజీ MP హర్షకుమార్ పేర్కొన్నారు. టీడీపీ కృష్ణ మాదిగను పావులా వాడుకుందన్నారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. 351 ఆర్టికల్ షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడినదని చెప్పారు. వర్గీకరణ చేసేందుకు పార్లమెంట్‌కు కూడా అధికారం లేదన్నారు. ఇది మోదీ, చంద్రబాబు కలిసి ఆడిన కుట్రగా అభివర్ణించారు.
భారీ వర్షాలు రొయ్యల సాగుకు ప్రతిబంధకంగా మారాయి. వర్షాలతో ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు బ్యాక్టీరియా, వైరస్ ఉద్ధృతి, వైట్ స్పాట్ రొయ్యల సాగుకు ప్రతికూలంగా పరిణమించాయి. కోనసీమ జిల్లాలో 14,400 హెక్టార్లలో, కాకినాడలోని 8,600 హెక్టార్లలో, తూ.గో. జిల్లాలోని 982 హెక్టార్లలో రొయ్యలు సాగు జరుగుతోంది. 3 జిల్లాల్లో కలిపి 28,596 మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు.
ఓ వైసీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదైంది. సీతానగరం SI రామకృష్ణ తెలిపిన వివరాలు.. ముగ్గళ్లకు చెందిన గుర్రాల అయ్యప్పస్వామి బర్త్‌డే సందర్భంగా గత నెల 27న రాత్రి వేడుకలు నిర్వహించారు. కొందరు యువకులు మద్యం మత్తులో కేకలు వేయగాతో స్థానిక ఉపసర్పంచి, TDP వర్గీయుడు రవికుమార్ వారిని వారించారు. దీంతో కులం పేరుతో దూషించి, చంపేస్తామని బెదిరించాడని ఉపసర్పంచి ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేశామన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశమని సూరజ్ గనోరే అన్నారు. ITDA POగా పని చేసి పదోన్నతిపై పల్నాడు జేసీగా వెళ్తున్న ఆయనను రంపచోడవరంలో అధికారులు, సిబ్బంది గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా సూరజ్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తనవంతు కృషి చేశానని, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అన్నారు. పీవో కట్టా సింహాచలం, తదితరులు ఆయన చేసిన సేవలను కొనియాడారు.
కాకినాడ నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. 48 గంజాయి లిక్విడ్ సీసాలు, ఆరున్నర కిలోల ఎండు గంజాయి, 4500 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు DSP హనుమంతరావు తెలిపారు. కాకినాడకు చెందిన ఇస్మాయేల్, మౌలాలి, అల్లూరి జిల్లాకు చెందిన కొండబాబును అరెస్ట్ చేశామన్నారు. వీరు కాకినాడలో విక్రయించేందుకు గంజాయి తీసుకొచ్చినట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నట్లు వారు తెలిపారు.
కోనసీమ జిల్లా అమలాపురం మార్కెట్ ఏరియాకు చెందిన నానిపై బుధవారం దాడికి పాల్పడిన సమనస గ్రామానికి చెందిన ముగ్గురిపై టౌన్ పోలీసులు SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నాని ప్రేమిస్తున్న యువతి బంధువులు ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు ధర్మారావు, శ్రీరామ్, కేశవ్‌పై కేసు నమోదు చేశారు. నానిపై దాడిని నేషనల్ ట్రిబ్యునల్ ఫెడరేషన్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఖండించారు.
పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రకటించారు. గురువారం పెన్షన్ల పంపిణీలో పాల్గొనేందుకు బుధవారం రాత్రి జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబుతో కలిసి పిఠాపురం చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీకి ఒక నియోజకవర్గాన్ని ప్రొటోకాల్ పరంగా సొంత నియోజకవర్గంగా ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండడంతో తాను ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. మహిళలపై దాడులు అరికట్టడానికి పోలీసు శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. వాళ్ల రక్షణ కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధితులు 9490760794కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Sorry, no posts matched your criteria.