India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూ.గో జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. వడదెబ్బకు వ్యక్తులు పిట్టల్లా రాలుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన ఉపాధిహామీ కూలీ చెరుకూరి సాహెబ్(68) శనివారం ఉదయం పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మారేడుమిల్లి మండలం పుల్లంగికి చెందిన కోర కాంతయ్య అనే వృద్ధుడు సైతం వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు.
తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ASI పీవీ నాగేశ్వరరావు గుండెపోటుతో శనివారం మృతిచెందారని చింతూరు ఎస్సై శ్రీనివారావు తెలిపారు. ఆయన ఏడుగురాళ్లపల్లి అవుట్ పోస్ట్‌లో డ్యూటీ చేస్తుండగా కుప్ప కూలిపోవడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. దీంతో చింతూరులో విషాదం నెలకొంది.
బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణుల సంఘం పెద్దలు శనివారం కిర్లంపూడిలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ విజయానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చింది వైసీపీ మాత్రమేనని చెప్పారు. బ్రాహ్మణులకు పదవులు కేటాయించిన ఘనత జగన్‌కు దక్కిందన్నారు.
సీతపల్లి వాగులో మునిగి సామర్లకోటకు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మరువక ముందే కోనసీమ జిల్లాలో మరోఇద్దరు యువకులు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం వానపల్లికి చెందిన ఆరుగురు యువకులు కపిలేశ్వరపురం మండలం నారాయణలంక వెళ్లారు. కాసేపు క్రికెట్ ఆడిన తర్వాత గోదావరిలో స్నానానికి దిగారు. నాగసతీష్(23), ప్రసన్నకుమార్(25) మునిగిపోగా స్థానికులు బయటకు తీశారు. అప్పటికే వారు మృతిచెందారు.
ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చని భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య ప్రకటించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఈవీఎమ్ యూనిట్‌లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ ఆయా నియోజక వర్గాల పరిధిలో శుక్రవారం నిర్వహించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత తెలిపారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎమ్‌ల కమిషనింగ్ రిటర్నింగ్ అధికారి ఎన్.తేజ్ భరత్ ఆధర్యంలో నిర్వహిస్తున్న ప్రక్రియని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో అనపర్తి నియోజకవర్గ ఓటర్ల నాడీ పట్టడం కష్టమే. ఇప్పటివరకు ఇక్కడ 15సార్లు ఎన్నికలు జరగ్గా.. సర్పంచ్‌లకు సైతం ఎమ్మెల్యేలుగా పట్టం కట్టి అసెంబ్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. 1971లో రామవరం సర్పంచ్‌గా గెలిచిన మూలారెడ్డి 1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కాగా.. అనపర్తి సర్పంచ్‌గా గెలిచిన రామారెడ్డిని కాంగ్రెస్ తరఫున 1989, 2004లో ఎమ్మెల్యేగా గెలిపించారు.
కాకినాడ జిల్లా తునిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుని మండలం చామవరం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంటుందని తెలిపారు. అక్కడి నుంచి పవన్ ప్రత్యేక వాహనంపై గొల్లప్పారావు సెంటర్‌కు చేరుకొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
వై.రామవరం మండలం డొంకరాయి సమీపంలో బైక్‌పై 6 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఇద్దరు యువకులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు SI శివకుమార్ తెలిపారు. విశాఖ అటవీ ప్రాంతం నుంచి జగ్గయ్యపేటకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. జగ్గయ్యపేటకు చెందిన గోపి, నరేంద్రను అరెస్ట్ చేశామన్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. గంజాయి పట్టుబడిందని ఎస్సై వివరించారు.
కాకినాడ జిల్లాలో పలుచోట్ల ఈరోజు చిరు జల్లులు కురిశాయి. కొద్దిరోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ చినుకులు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. తుని నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. మబ్బులు కమ్మేసి వర్షం పడింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపించగా.. మధ్యాహ్నం 3:30గంటల వేళ వాతావరణం చల్లబడి గాలులు వీస్తూ, వర్షం కురిసింది. మీ ఏరియాలో చినుకులు పడ్డాయా..? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.