India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం అరుదైన రామసేతు శిలను సేకరించారు. రాములు ఇటీవల రామసేతు వారధిని సందర్శించగా..అక్కడి నుంచి శిలను సేకరించినట్లు తెలిపారు. ఈ రాయితోనే రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వానరులతో కలిసి వంతెన వంతెన నిర్మించారన్నారు. సుమారు 225 గ్రాముల బరువు ఉంటుందని, ఈ రాయి నీటిలో మునగదని ఆయన వివరించారు. చుట్టుపక్కల వారు ఆ శిలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ATMలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో పరారైన ఉద్యోగి వాసంశెట్టి అశోక్‌ను 24 గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూ.గో ఎస్పీ కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. జల్సాలకు అలవాటు పడి నగదు చోరీకి పాల్పడ్డట్లు గుర్తించామన్నారు. రాత్రి వర్షంలో మండపేట సమీపంలో వాసంశెట్టి అశోక్‌ను అరెస్టు చేశామని తెలిపారు. అతడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 24 గంటల్లో కేసును చేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి రైల్వేస్టేషన్ అభివృద్ధి, ఇతర రైల్వే సమస్యలపై చర్చించారు. ఈ అభివృద్ధి పనులకు గాను బడ్జెట్‌లో రూ.269 కోట్లను కేటాయించినందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం 7 గంటల వరకు 13.60 అడుగులతో గోదావరి నీటిమట్టం నిలకడగా ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 12.49 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర జలాల్లోకి వదులుతున్నారు. మూడు పంట కాలువల ద్వారా 5900 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల చేస్తున్నారు.
రాజోలు నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో విద్యుత్ కొరతతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి గుడిమెళ్లంక, గుడిమూలలో విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని, లక్కవరం, రాజోలు సబ్ స్టేషన్ల కెపాసిటీని 5ఎంవీఏ నుంచి 8 ఎంవీఏకు పెంచాలని కోరారు.
ATMలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో ఉద్యోగి పరారైన ఘటన రాజమండ్రిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఉద్యోగి అశోక్ కుమార్ ATMలలో నగదు డిపాజిట్ కోసం వెళ్లాడు. అయితే.. వాటిని డిపాజిట్ చేయకుండా ఉడాయించడంతో పోలీసులకు సమాచారం వచ్చింది. అశోక్ దాదాపు రూ.2.40 కోట్లతో పరారైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అలర్ట్ చేసి అతడి కోసం గాలిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద నిలకడగా ఉంది. ఇక్కడ వరద నీటిమట్టం 13.70 అడుగులుగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద 47.10 అడుగులకు వరద చేరడంతో అక్కడ సైతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రస్తుతం 12.70 లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి వదలడంతో పలు లంక గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి.
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 13.60 అడుగులకు చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను ఎత్తి 12.58 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. మూడు పంట కాలువలు ద్వారా 5,400 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు.
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గురువారం కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పిఠాపురంలో కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (NIEL IT) ఏర్పాటుచేయాలని ఎంపీ కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
సౌదీ అరేబియాలో చిక్కుకున్న అంబాజీపేటలోని ఇసుకపూడికి చెందిన యువకుడు వీరెంద్రకూమార్‌ను ప్రభుత్వం బుధవారం స్వదేశానికి తీసుకువచ్చే చర్యలు చేపట్టింది. అయితే బాధితుడికి యాజమాని ఇంకా పాస్ పోర్ట్ ఇవ్వకపోవడంతో ప్రయాణం వాయిదా పడిందని అధికారులు తెలిపారు. సమస్యపై కలెక్టర్ మహేశ్ పాస్ పోర్ట్ అధికారులను సంప్రదింపులు చేసి, రెండు రోజుల్లో తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.