India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి 1 వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అన్నమయ్య జిల్లాకు మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తక్షణం ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిందని ఆమె తెలిపారు. అధికారులు గమనించాలన్నారు.

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ నాయనమ్మ జల్లేపల్లి అచ్చయ్యమ్మ (107) మంగళవారం వయస్సు భారంతో రాత్రి మరణించారు. మృతురాలికు ఐదుగురు కుమారులు నలుగురు కూతుళ్లు కలిపి 150 మంది సభ్యుల కుటుంబానికి ఆమె పెద్దదిక్కుగా ఉన్నారు. గ్రామస్థులందరూ ప్రేమతో అమ్మమ్మగా పిలుచుకునే ఆవిడ మృతికి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, గ్రామస్థులు సంతాపం తెలియజేశారు.

బాలికను పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన డి. కిరణ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు ఎస్సై కే. శ్రీహరిరావు తెలిపారు. కడియానికి చెందిన ఫ్యామిలీ సంక్రాంతికి కొవ్వూరుకు వచ్చారు. సొంతూరు వెళ్లే క్రమంలో 14 ఏళ్ల బాలిక మిస్సైంది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కనుగొనగా.. ఆమె తెలిపిన వివరాలతో యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

గంగవరం మండలం దొనేపల్లి గ్రామంలో పొలంలోకి వెళ్లిన బి.విష్ణు దొర, అనే వ్యక్తిని పిల్లలు కలిగిన అడవి పంది తీవ్రంగా గాయపరిచింది. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి కిషోర్ పైలట్ త్రిమూర్తులు హుటాహుటిన క్షతగాత్రుడిని దగ్గరలోని గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు.

CBI అంటూ మహిళ నుంచి రూ.2.5కోట్లు దోచుకున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ జరిగిందని భయపెట్టి ఆమె నుంచి రూ.2.5 కోట్ల దోచుకున్నారు. రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రూ.24.5 లక్షల నగదు, కారు, రెండు ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అతని అకౌంట్లులోని బాధిత మహిళ రూ.26 లక్షలు ఫ్రీజ్ చేశారు.

రంగంపేట రెవెన్యూ కార్యాయంలో అధికారులు సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. పాతకోటపాడులోని సర్వే నంబర్ 44లో 2.71ఎకరాలను పలు సామాజిక వర్గాలు శ్మశానంగా వినియోగిస్తున్నాయి. అదే స్థలాన్ని హైస్కూల్ నిర్మాణానికి కేటాయించడంపై సహించేది లేదని తహశీల్దార్ కోను అనసూయకు ఇండియన్ యాక్ట్స్ ఆవెర్నెస్ వలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుందేటి వెంకట రమణ వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు.

హుకుంపేట డీబ్లాక్ చెందిన నేదునూరి సంతోష్‌కుమార్(25) కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా మద్యానికి బానిసై మనస్థాపం చెందడంతో సోమవారం మధ్యాహ్నం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య లీలాకుమారి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఎస్సై ఆర్ అంకారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.

జిల్లాలో మార్చి నాటికి 3823 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకూ 435 పూర్తి చేశారని, కొవ్వూరు, అనపర్తి, చాగల్లు, సీతానగరం మండలాల్లో తక్కువ ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెపండుగ ద్వారా 667 సీసీ రోడ్లు లక్ష్యం కాగా, 493 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో గృహ నిర్మాణాలు నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం చెయాలని , ఫిబ్రవరి మొదటి వారంలో గృహ ప్రవేశాలను ప్రజాప్రతినిధులు సమక్షంలో వేడుకగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం గృహ నిర్మాణాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు చేపట్టనున్న దృష్ట్యా పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించేలా సిద్ధంగా ఉంచాలన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు తణుకు పర్యటన వాయిదా పడింది. ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు ఇటీవల కలెక్టర్‌తో పాటు ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించారు. అయితే అనివార్య కారణాల వలన సీఎం పర్యటన వాయిదా పడినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం తెలిపారు. కూటమి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.