India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామచంద్రపురం మండలం చోడవరం బైపాస్ రోడ్డులోని RRగ్రాండ్ లాడ్జిలో వ్యభిచార ముఠాను రామచంద్రపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ దొరరాజు తెలిపిన వివరాలు.. లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో SI సురేష్ బాబు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 3 పార్లమెంట్ స్థానాలకు 42 మంది పోటీలో ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ బరిలో 15 మంది, అమలాపురం పార్లమెంట్ నుంచి 15 మంది, రాజమండ్రి MP స్థానానికి 12 మంది పోటీ చేస్తున్నారు. ఇక కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీలకు 108 మంది, కోనసీమ జిల్లాలో 7 అసెంబ్లీలకు 91 మంది, తూ.గో జిల్లాలో 7 అసెంబ్లీలకు 71 మంది పోటీ చేస్తున్నారు.
కన్నకొడుకును తండ్రి చంపేసిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. CI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ గ్రామీణ మండలం ఇంద్రపాలేనికి చెందిన అరవింద్ (26) వృత్తిరీత్యా కారుడ్రైవర్. కొంతకాలంగా మద్యం, గంజాయికి బానిసయ్యాడు. నిత్యం తల్లిదండ్రులను వేధించేవాడు. సోమవారం కూడా తండ్రితో వాగ్వాదం జరిగింది. దీంతో మంగళవారం ఉదయం తండ్రి వెంకటరమణ ఇనుపరాడ్‌తో అరవింద్‌ను బలంగా కొట్టగా చనిపోయాడు. కేసు నమోదైంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం మండపేటలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మండపేటలో పలుచోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు టౌన్ సీఐ అఖిల్ జమ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండపేట రాక సందర్భంగా టౌన్ లోనికి ఏ విధమైన భారీ వాహనాలు రావద్దని కోరారు. వాహనదారులు బైపాస్ రోడ్‌లో వెళ్లాలని సూచించారు.
అమలాపురం పార్లమెంట్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా గౌతమ్ జంగా, బీఎస్పీ అభ్యర్థిగా యాళ్ల దొరబాబు, టీడీపీ అభ్యర్థిగా జీఎం హరీష్ బాలయోగితో పాటు మరో 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వీరిలో గెలిచేదెవరో కామెంట్ చేయండి
రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు మండలం తులసిపాక సమీపంలో ఓ వ్యక్తి మంగళవారం సోకులేరు వాగులో పడి మృతి చెందాడు. మృతుడు నందిగామకు చెందిన కొండయ్య(40)గా గుర్తించారు. మోతుగూడెం SI గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి నుంచి లారీని నడుపుతూ నందిగామ వస్తున్న కొండయ్య మార్గ మధ్యలో స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. కాలు జారి ఊబిలో పడి ప్రాణాలు విడిచాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నల్లజర్ల మండలం నభీపేటకు చెందిన ప్రవీణ్ కుమార్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనికి రెండేళ్ల క్రితం పెళ్లైంది. కాగా సోమవారం అన్న రవితేజకు ఫోన్ చేశాడు. పనికి వస్తానని కొందరి వద్ద డబ్బులు తీసుకున్నా.. వాటిని బైక్ అమ్మి కట్టేయండి.. అనంతపల్లి కాలువలోకి దూకేస్తున్నానని చెప్పాడు. రవితేజ పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహం బయటకు తీయించారు. కేసు నమోదైంది.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన BJP సీనియర్ నేత బండారు సూర్యచంద్రరావు(67) సోమవారం వడదెబ్బకు గురై మృతిచెందారు. పార్టీ స్థాపించినప్పటినుంచి అందులోనే కొనసాగారు. సోమవారం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఎండవేడిమికి తీవ్ర అస్వస్థతకు గురై రోడ్డుపై పడిపోయారు. ఇంటికి తీసుకెళ్లేలోపు మృతిచెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
కాకినాడ జిల్లాలోని 18 మండలాల్లో మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం తెలిపారు. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం.. గండేపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట, కాకినాడ రూరల్, కరప, కిర్లంపూడి, కోటనందూరు, ఉప్పాడ కొత్తపల్లి, పెదపూడి, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరం, సామర్లకోట, తొండంగి, తుని, ఏలేశ్వరం మండలాల్లో వడగాలులు వీస్తాయన్నారు.
ఏప్రిల్ 30వ తేదిన ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా మండపేట నియోజకవర్గంలో జరగాల్సిన వారాహి విజయభేరి బహిరంగ సభ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని కూటమి శ్రేణులు గమనించాలని, ఇదే వారంలో తిరిగి పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని పేర్కొంది. తేదీ ఖరారు కాగానే వివరాలు తెలియజేస్తామని నాయకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.