EastGodavari

News April 29, 2024

కుమార్తె సమక్షంలో టీడీపీలో చేరిన తల్లి

image

రాజవొమ్మంగి మండలం గింజర్తి వార్డు మెంబర్ కృష్ణవేణి టీడీపీలో చేరారు. ఆమె వార్డు మెంబర్‌గా గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె కుమార్తె శిరీషాదేవి రంపచోడవరం ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామంలో శిరీష తన తల్లికి స్వయంగా టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుమార్తె విజయానికి ప్రచారం చేస్తానని కృష్ణవేణి అన్నారు.

News April 29, 2024

జనసేన రెబల్ పాఠంశెట్టికి ‘గాజు గ్లాసు’ గుర్తు

image

జనసేన జగ్గంపేట రెబల్‌ అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. పాఠంశెట్టి MLA టికెట్ ఆశించగా.. కూటమిలో భాగంగా జ్యోతుల నెహ్రూ(టీడీపీ)కు దక్కింది. దీంతో పాఠంశెట్టి, మరో ఇద్దరు అసంతృప్తులు నామినేషన్స్ వేశారు. ఈ ముగ్గురి పేర్లు పేపర్లలో రాసి డ్రా తీయగా.. పాఠంశెట్టికి ‘గాజు గ్లాసు’ దక్కింది. జగ్గంపేటలో గెలిచి పవన్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని పాఠంశెట్టి పేర్కొన్నారు.

News April 29, 2024

రేపటి నుంచి ‘ఓటర్‌ స్లిప్స్‌’ పంపిణీ: కలెక్టర్ నివాస్

image

ఈనెల 30 నుంచి ఇంటింటికి ‘ఓటర్‌ స్లిప్స్‌’ పంపిణీ చేయడం జరుగుతుందని ఎన్నికల అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్‌ స్లిప్‌లను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News April 29, 2024

తూ.గో.: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భట్నవిల్లి వద్ద లారీ- ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు యువకులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో పుట్టినరోజు వేడుకులు నిర్వహించుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు సాపే నవీన్, జతిన్, నవీన్ కుమార్, అజయ్‌ మామిడికుదురు మండలవాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 29, 2024

రాజమండ్రి: బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం

image

హైదరాబాద్‌కు చెందిన రమ్య, రాజమండ్రికి చెందిన వరలక్ష్మి స్థానిక JN.రోడ్డులో బ్యూటీపార్లర్ స్పామసాజ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో ప్రకాశంనగర్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి నిర్వాహకులైన మహిళలతో పాటు ముగ్గురు యువతులు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు CI సత్యనారాయణ తెలిపారు.

News April 29, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి: కలెక్టర్

image

రాజకీయ పక్షాలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. ఓట్లను పొందటం కోసం కులం, మత పరమైన భావాల పరంగా అభ్యర్థనలు చేయరాదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చీలు, దేవాలయాలు లేక మరే ఆరాధనా ప్రదేశాలనూ వేదికగా ఉపయోగించకూడదన్నారు. నాయకులు, కార్యకర్తల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయరాదన్నారు.

News April 28, 2024

జగన్ ప్రభుత్వాన్ని అరటి తొక్కలా పడేయాలి: పవన్

image

అరటిపండు తొక్కలాగా జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఏలేశ్వరంలో పవన్ ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. దళితుల కోసం గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందన్నారు.

News April 28, 2024

మే 1-5 వరకు ఖాతాల్లో పెన్షన్ జమ: కలెక్టర్ హిమాన్షు

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేపడతామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం వెల్లడించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పెన్షన్ సొమ్ము జమ చేస్తామన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి పరిమితమైన వారు, సైనిక, సంక్షేమ పింఛన్లు పొందే వారికి ఇంటి వద్దనే సెక్రటేరియట్ సిబ్బంది పెన్షన్లు అందజేస్తారన్నారు.

News April 28, 2024

పవన్‌ కళ్యాణ్‌కు కన్నబాబు కౌంటర్

image

కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ పిచ్చిగా డాన్స్ వేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. చిరంజీవి ఆహ్వానం మేరకు తాను 2009లో PRPలో చేరా. ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టారు. పవన్ రాజకీయాలకు పనికిరారు. చిరంజీవి తమ్ముడు కాకుంటే టీ షాప్‌లో పని చేసేవారు’ అని అన్నారు. కాగా.. నిన్న కన్నబాబుపై పవన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

News April 28, 2024

తూ.గో.: సెలవు అయినా.. బిల్లు కట్టేందుకు అవకాశం

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా విద్యుత్, రెవెన్యూ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మూర్తి శనివారం తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు చెల్లించే అవకాశం కల్పించామన్నారు. ఏపీఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్లలో సైతం చెల్లింపులు చేయవచ్చని తెలిపారు.