India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 29, 30వ తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ టీడీపీ SVSN వర్మ తెలిపారు. 29న గొల్లప్రోలు మండలం చెందుర్తి నుంచి రోడ్‌షో ప్రారంభించి కొడవలి, వన్నెపూడి, మీదుగా పిఠాపురం మండలంలోకి ప్రవేశించి వెల్దుర్తి, పి.తిమ్మాపురం మీదుగా రోడ్‌షో సాగుతుందన్నారు. 30న చిత్రాడలో ప్రారంభమై గొల్లప్రోలు పట్టణంలో కొనసాగుతుందన్నారు.
కాకినాడ ఆంధ్రా పేపర్ మిల్‌లో ఓ ఉద్యోగి అనుమానస్పదంగా మృతిచెందాడు. సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..జగన్నాథపురానికి చెందిన విజయ్ భార్గవ్ (39) పేపర్ మిల్‌లో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తూ స్థానిక మిల్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. శనివారం ఉద్యోగానికి వెళ్లకపోవడంతో సహోద్యోగి వచ్చి తలుపు కొట్టగా తీయలేదు. పోలీసులు అక్కడికి చేరుకొని భార్గవ్ మృతి చెందడాన్ని గమనించారు. ఈ మేరకు కేసు నమోదుచేశారు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) కుటుంబీకులు స్థానిక నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆయన వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను అన్న సుబ్బరాజు మాట్లాడుతూ.. తన తమ్ముడు చేయని నేరానికి ఆరేళ్లు విచారణ ఖైదీగా జైలు జీవితం గడిపాడన్నారు.
తూ.గో జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా వివరాలను కలెక్టర్ కె.మాధవీలత శనివారం ప్రకటించారు. జిల్లాలో 7 నియోజకవర్గాలలో 16,23,149 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 7,92,317, స్త్రీలు 8,30,735, థర్డ్ జెండర్ 97 మంది ఉన్నారన్నారు. రాజమండ్రి రూరల్‌లో అత్యధికంగా పురుషులు 1,33,241 మంది, స్త్రీలు 1,39,561 మంది ఓటర్లు ఉండడం గమనార్హం.
కిర్లంపూడిలో ఆదివారం జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి దాట్ల కృష్ణ వర్మ, బీజేపీ నాయకురాలు కామినేని జయశ్రీ తదితరులతో నెహ్రూ సమావేశం నిర్వహించారు.
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం.. ఆదివారం కాకినాడ జిల్లాలోని 14 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ నివాస్ తెలిపారు. ఏలేశ్వరం, గండేపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెదపూడి, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రౌతులపూడి, సామర్లకోట, తుని, శంఖవరం మండలాల్లో వడగాల్పులు వీస్తాయన్నారు. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నగరాన్ని వైసీపీ ప్రజా ప్రతినిధులు బ్లేడ్, గంజాయి బ్యాచ్, డ్రగ్స్‌లకు నిలయంగా మార్చేశారని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురందీశ్వరి ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు ప్రచారం నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్‌లో పాదయాత్ర ముగిసిన తరువాత జరిగిన సభలో కూటమి అభ్యర్థులు ప్రసంగించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 7న రాజమండ్రి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రాజమండ్రి పర్యటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, పోలీస్ అధికారులు ముఖ్య నేతలతో కలిసి సభా ప్రాంగణ నిర్వహణకు స్థలాలను పరిశీలించారు. వేమగిరి గైట్ కళాశాల స్థలాన్ని కూడా పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ నెల 29న పి.గన్నవరం నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అంబాజీపేట మండలం 4 రోడ్ల జంక్షన్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ బహిరంగ సభ జరుగుతుందని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారని పిఠాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం కుమరాపురంలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్లేడ్స్‌తో దాడి చేస్తున్నారని రౌడీతత్వాన్ని పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టారని పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.