EastGodavari

News March 30, 2024

తూ.గో.: 9 మంది వాలంటీర్ల రాజీనామా

image

తూ.గో. జిల్లా కడియం మండలంలో 9 మంది గ్రామ వాలంటీర్లు వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు కడియం ఎంపీడీవో జి.రాజ్ మనోజ్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీరిలో ఏడుగురు కడియం, మిగిలిన ఇద్దరు కడియపులంక గ్రామానికి చెందిన వారు ఉన్నారన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు వారు చెప్పారని ఎంపీడీవో తెలిపారు.

News March 30, 2024

పిఠాపురం: వర్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న పవన్‌కళ్యాణ్

image

పిఠాపురం నుండి MLA అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్మ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్‌ని ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం వర్మ తల్లి అలివేలు మంగ పద్మావతి ఆశీర్వాదం తీసుకున్నారు.

News March 30, 2024

తూ.గో.: CM సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన ఇన్‌ఛార్జి

image

కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ శనివారం వైసీపీలో చేరారు. అనంతపురం జిల్లాలో సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పర్యటించిన సీఎం జగన్‌ను పితాని బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పితాని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా జగన్ ఓదార్చారు. ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ పాల్గొన్నారు.

News March 30, 2024

తూ.గో: వేసవి ప్రారంభంలోనే భానుడి భగభగలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ఆఖరు నాటికే సుమారు 35-38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రమై ప్రయాణికులు, పనులకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

News March 30, 2024

తూ.గో: వేసవి ప్రారంభంలోనే భానుడి భగభగలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికే సుమారు 35 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత అధికం కావడంతో భానుడి భగభగలు మిన్నంటుతున్నాయి. ఈ వేసవి సీజన్‌ ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు మూడు డిగ్రీల వరకూ అధికంగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తుంది.

News March 30, 2024

ఇంకా టైం ఉంది.. ఏమైనా జరగొచ్చు: ఎంపీ RRR

image

చంద్రబాబే కాబోయే సీఎం అని బల్ల గుద్ది చెబున్నానని MP రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఛాన్సే లేదు. కూటమి టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ మంచి మిత్రుడు. పార్టీకి ఆయన చేసిన సేవ వల్లే టికెట్ పొందారు. దిల్లీ పెద్దలు సర్వే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఏమైనా జరగొచ్చు. నాకు న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా’నని స్పష్టం చేశారు.

News March 30, 2024

తూ.గో జిల్లాలో రబీ వరి కోతలు ప్రారంభం

image

తూర్పు గోదావరి జిల్లాలో రబీ వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 2,204 హెక్టార్లలో పూర్తవడం ద్వారా 4శాతం లక్ష్యాన్ని రైతులు సాధించారు. రాజానగరం మండలం మరింత పురోగతి సాధిస్తూ 1,000 హెక్టార్లలో పూర్తయి 30 శాతానికి చేరువైంది. వారం పది రోజుల వ్యవధిలో వరి కోతలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు లబ్ధి చేకూర్చాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది.

News March 30, 2024

పిఠాపురంలో పవన్ షెడ్యూల్ ఇలా.. నేటి నుంచి షురూ

image

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. తొలిరోజు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో పవన్‌ దిగనున్నారు. అక్కడి నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం, అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. అనంతరం దొంతమూరులో TDP మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ నివాసానికి వెళ్లి ఆయనను పలకరిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు చేబ్రోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

News March 29, 2024

తూ.గో.: ‘మా కుటుంబాన్ని ఆ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది’ 

image

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తల్లి సత్యవతి అనపర్తి ప్రజలను ఉద్దేశించి శుక్రవారం ఓ కరపత్రం విడుదల చేశారు. తన భర్త మూలారెడ్డి, కుమారుడు రామకృష్ణారెడ్డి టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషిచేశారన్నారు. అధికార పార్టీ తమ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇప్పుడు టీడీపీ ఇచ్చిన టికెట్‌ను కాదని అన్యాయం చేస్తుందని, తమకు ప్రజలే మద్దతుగా నిలవాలన్నారు.

News March 29, 2024

రాజేష్ మహాసేన పోస్ట్.. APR 1న ఏం చెప్పనున్నారు..?

image

రాజేష్ మహాసేన సోషల్ మీడియోలో పెట్టిన పోస్ట్‌పై ఆసక్తి నెలకొంది. ‘తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, పార్టీ మారుతానని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2019లో జగన్ కోసం పని చేసి మోసం పోయాం. తర్వాత జనసేన కోసం కష్టపడ్డా అవకాశం రాలేదు. TDP నుంచి అనివార్య కారణాలతో అవకాశం కోల్పోయాం. అందుకే ‘మహాసేన’ చెప్పినట్లు చేయాలనుకుంటున్నా. అదేంటో APR 1న తెలిజయేస్తా’ అని రాసుకొచ్చారు. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.