India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోనసీమ , కాకినాడ , రాజమండ్రి పార్లమెంటు ఆయా పరిధిలోని 21 అసెంబ్లీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడ పార్లమెంట్లకు 32, రాజమహేంద్రవరం పార్లమెంటు 19, అమలాపురం పార్లమెంటు 21 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 21అసెంబ్లీ స్థానాలకు గాను కాకినాడ జిల్లా 170, తూర్పు గోదావరి జిల్లా 114 డా.బి.ఆర్. కోనసీమ జిల్లా 175 నామినేషన్లు దాఖలయ్యాయి .
దశాబ్దాల నుండి ప్రత్తిపాడులో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ఏలుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ సెగ్మెంట్లో మొదట ముద్రగడ కుటంబం హవా కొనసాగగా.. తరువాత పర్వత కుటుంబం ఒక వెలుగు వెలిగింది. తదనంతరం వరుపుల కుటుంబం అధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి సత్యప్రభ బరిలో నిలబడగా, వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు ఉన్నారు
రాజమండ్రి-కొవ్వూరు మధ్య ఉన్న గామన్ బ్రిడ్జి మరోసారి మరమ్మతులకు గురైంది. రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వచ్చే మార్గంలో 28వ స్తంభం వద్ద అమర్చిన బేరింగ్‌లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు ఈ మార్గంలో వాహన రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు సమాచారం. బేరింగ్ మార్పు చేయడానికి 10 రోజుల పాటు వంతెనపై ఒక మార్గంలోనే వాహన రాకపోకలకు అనుమతించనున్నారు.
పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 27న వస్తున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట రింగ్ రోడ్ సెంటర్లో శనివారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామని, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ నేతలు పాల్గొంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సభకు ఏర్పాట్లు చేపట్టినట్లు టౌన్ అధ్యక్షులు అడబాల కుమార్ స్వామి తెలిపారు.
పి.గన్నవరం నియోజకవర్గంలో ఒకే పేరు కలిగిన ముగ్గురు వ్యక్తులు పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో పాటు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా అదే పేరున్న గిడ్డి సత్యనారాయణ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో గిడ్డి సత్యనారాయణ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. దీంతో ఎవరికి ఏ మేర నష్టం వాటిల్లుతుందో వేచి చూడాలి.
JEE మెయిన్స్ పరీక్షల్లో డా.బీఆర్.అంబేడ్కర్ జిల్లా కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన బండారు సాయి నరేన్ జాతీయ స్థాయి ఓపెన్ క్యాటగిరిలో 648వ ర్యాంక్ సాధించారు. నరేన్ తండ్రి బండారు శ్రీనివాసరావు గంటి జడ్పీ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ మేరకు విద్యార్థిని గ్రామస్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కోఆర్డినేటర్‌గా సానా సతీష్ ఎంపికయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలపై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ పార్లమెంటరీ కోఆర్డినేటర్‌గా తోట నవీన్, పెద్దాపురం కోఆర్డినేటర్‌గా రాజా సూరిబాబు రాజు, జగ్గంపేట కోఆర్డినేటర్‌గా అప్పలరాజు, కాకినాడ కోఆర్డినేటర్ గా వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాకినాడ జిల్లాలో టీడీపీకి షాక్ తగలనుంది. తుని నుంచి టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సీటును ఆశించిన యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు TDPపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి YCPలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జగన్ సమక్షంలో ఈ నెల 27న వైసీపీలో చేరనున్నట్లు టాక్.
ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమై రంపచోడవరం డివిజన్ లో కొన్ని రోజులుగా సారా బట్టీలు, దుకాణాలపై దాడి చేసి115 కేసుల్లో 88మందిని అరెస్ట్ చేశామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఇంద్రజిత్ గురువారం వెల్లడించారు. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై. రామవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మండలాల్లో ఈ దాడులు చేశామన్నారు. సారా బట్టీలు, సారా అమ్మకాలపై తగు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అల్లవరం మండలం రెళ్ళుగడ్డలో వివాహితపై కత్తితో దాడి చేసి హత్య చేసిన కొంబత్తుల నవీన్ కుమార్ స్థానికులకు దొరికాడు. గురువారం ఉదయం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో బాత్రూమ్‌లో మాటు వేసి మరో మహిళపై హత్యాయత్నానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం నవీన్ కుమార్‌ను అల్లవరం ఎస్సై హరీష్ కుమార్ కు అప్పగించారు.
Sorry, no posts matched your criteria.