India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో జిల్లా వ్యాప్తంగా 3 పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాలకు 145 నామినేషన్లు దాఖలయ్యాయి.18వ తేదిన మొదలైన నామినేషన్ల పర్వం చివరి అంకానికి చేరుకొంది. అందులో భాగంగా 3 పార్లమెంటు స్థానాలకు 24 నామినేషన్లు దాఖలుకాగా… మిగిలిన ఉమ్మడి జిల్లాలో 21 అసెంబ్లీ స్థానాలకు కలసి 121 నామినేషన్లు దాఖలైనట్లు ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి సంబంధించి ఇప్పటివరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు మొత్తం 11 మంది అభ్యర్థులు, 19 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గురువారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ మలికిపురంలోని పద్మజ సినిమా హాల్ కూడలి సమీపంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈమేరకు రాజోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు బుధవారం తెలిపారు. ఈ సభకు కూటమి శ్రేణులు హాజరు కావాలని కోరారు.
తన విజయం కోసం సైకిల్ యాత్ర చేస్తున్న వ్యక్తిని కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంగళవారం కలిసి కాసేపు సైకిల్ తొక్కిన విషయం తెలిసిందే. దీనిపై X (ట్విటర్) వేదికగా RGV స్పందించారు. ‘పై ఫొటొలో ఉన్నది నేను. ఇంటర్ చదవుతున్న రోజులవి. కింద ఎవరున్నారో నాకు తెలియదు. కానీ రెండు ఫొటోల్లో సైకిల్ కామన్. జై టీడీపీ’ అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కూటమి నుంచి వరుపుల సత్యప్రభ పొటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బరావు బరిలో ఉన్నారు. అయితే రాజకీయంగా వీరు ప్రత్యర్థులు అయినప్పటికీ వరుసకు వీరు తాత, మనవరాలు.
ఆధ్యాత్మిక పట్టణంగా పేరుగాంచిన పిఠాపురం ఓటర్లు ఎన్నికల్లో విభిన్న తీర్పుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరగగా 1989 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏఒక్క అభ్యర్థీ 2వసారి గెలిచిన దాఖలాలు లేవు. అయితే రానున్న ఎన్నికల్లో కొత్తగా పొటీచేస్తున్న పవన్ గెలుస్తారా లేదా సెంటిమెంట్‌కు భిన్నంగా 2009లో విజయం సాధించిన వంగా గీతకు మరోసారి పట్టంకడతారా అనేది ఆసక్తిగా మారింది. – మీ కామెంట్..?
BJP యువమోర్చా రాష్ట్ర సెక్రటరీగా అనపర్తి నియోజకవర్గానికి చెందిన శివరామ కృష్ణంరాజు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధీశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలుత శివరామకృష్ణంరాజును ప్రకటించినా.. కూటమి సమీకరణాల్లో భాగంగా అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మార్చారు. దీంతో శివరామకు ఈ పదవి ఇచ్చారు.
రాజవొమ్మంగి విద్యానగర్‌కు చెందిన చికిరెడ్ల నూకరాజు వడదెబ్బకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. రాజవొమ్మంగి గ్రామం శివారున ఉన్న జీడిమామిడి తోటలో జీడీపిక్కల సేకరిస్తూ వేడిని తట్టుకోలేక ఇంటికి వచ్చి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అంబులెన్సులో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
తూ.గో జిల్లా మాజీ సైనికులకు, సైనిక సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే వివిధ పథకాలు, ప్రయోజనాలను పొందేలా దరఖాస్తు చేసుకునేందుకు ap.sainic.com వెబ్ సైట్ ను రూపొందించినట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు వారి వివరాలను తప్పనిసరిగా ఈ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
ఎన్నికల ఉల్లంఘనలపై ఈ నెల 16-23 వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 480 ఫిర్యాదులు వచ్చాయని సీపీఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. వాటిలో 94 ఫిర్యాదులు ఎన్నికలకు సంబంధం లేని వాటిగా గుర్తించి వాటిని తిరస్కరించామన్నారు. 386 ఫిర్యాదులను 100 నిమిషాల లోపు పరిష్కరించామన్నారు. మిగిలిన 37 ఫిర్యాదులను వంద నిమిషాలు తర్వాత పరిష్కరించామని చెప్పారు. వెలగపూడి కార్యాలయానికి వచ్చిన 33 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
Sorry, no posts matched your criteria.