India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ పోర్టు – విశాఖపట్నం(17267), విశాఖపట్నం- కాకినాడ పోర్టు (17267) రైళ్లను ఈ నెల 29 – మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు. భావనగర్ – కాకినాడ పోర్టు (12756) రైలును మే 4, 11, 18, 25 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ డివిజన్లో మరమ్మతు నిర్వ హణ పనుల కోసం మార్పులు చేశామన్నారు.
ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో బుధవారం నుంచి గర్భాలయ దర్శనాలను నిలిపివేస్తున్నారు. శివలింగంపై గుంటలు పడి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో శివలింగానికి రసాయనాలు పూసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం నుంచి జూన్ 30వ తేదీ వరకు ఆలయాన్ని మూసి ఉంచుతామని ఆలయ అధికారులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో మంగళవారం విషాదం నెలకొంది.
క్వారీలో స్నానానికి దిగి 13 ఏళ్ల కుంచల వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెళ్లుగడ్డలో మంగళవారం బొంతు మణికుమారి (30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూంలో మాటువేసిన ఆగంతకుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. హత్య సమయంలో డోరు లోపల గడియ వేసిఉందని, కిటికీ లోంచి ఆమె తోడికోడలు, కుమారుడు చూసి కేకలు వేశారు. ఎస్ఐ హరీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు గండేపల్లి పోలీసులు తెలిపారు. 2019 జనవరి 22న గండేపల్లి గ్రామ శివారులో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్, స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టగా.. స్కూటీ చోదకుడు మృతి చెందాడు. ఈ క్రమంలో సోమవారం పెద్దాపురం కోర్టు మెజిస్ట్రేట్ జి.హర్షవర్ధన్ తీర్పు వెల్లడించారు.
తూ.గో జిల్లాలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. 4వ రోజు సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీ లత తెలిపారు. లోక్ సభకు 4, అసెంబ్లీలకు 20 దాఖలయ్యాయని అన్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా సోమవారం వరకూ లోక్ సభకు 5 నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు 48 దాఖలయ్యాయి.
రాజమండ్రిలోని సిద్ధార్థ నగర్ కు చెందిన బొజ్జి మహాలక్ష్మి (63) ఒంటిపై పెట్రోలు పోసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుమారుడు బొజ్జి రాజశేఖర్ తన తల్లికి మతిస్థిమితం సరిగాలేదని, గత కొన్ని రోజులుగా చనిపోతానంటూ చెప్పేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13 ఓటు హక్కు వినియోగించుకునేందుకు తూ.గో జిల్లాలోని వివిధ ప్రైవేటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లలో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు కార్మికశాఖ సహాయ కమిషనర్ బి.ఎస్.ఎం. వల్లి తెలిపారు. ఓటుహక్కు ఉన్న కార్మికులందరికీ పోలింగ్ రోజున సెలవు మంజూరు చేయాలని ఆయా సంస్థల యాజమాన్యాన్ని కోరారు.
☞ అభ్యర్థి: వంగా గీత (వైసీపీ)
☞ విద్యార్హతలు: బి.ఎ, బి.ఎల్, ఎం.ఎల్
☞ కేసులు: ఏమీ లేవు
☞ చరాస్తులు: రూ.2.10 కోట్లు, భర్త పేరు మీద రూ.27.81 లక్షలు
☞స్థిరాస్తులు: రూ.13.11 కోట్లు, భర్త పేరు మీద రూ.13.64 కోట్లు
☞ అప్పులు: రూ.4.51 కోట్లు, భర్త పేరు మీద రూ.51.64 లక్షలు
కాకినాడ జిల్లా సామర్లకోట RTC కాంప్లెక్స్‌లో ఓ మహిళను ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టగా ఆమె మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాంప్లెక్స్‌లో బస్సును మలుపు తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా మహిళను ఢీకొట్టిందన్నారు. మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశం లేకపోయినప్పటికీ.. ఎందుకు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.