India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో. జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాశి (24) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దుర్గారావును ప్రేమవివాహం చేసుకుంది. కాగా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆదివారం కాలువలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.
పిఠాపురం MLAగా గెలుపొంది, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా నియోజకవర్గానికి రానున్నారు. ఉదయం 7:30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 9 గంటలకు చేబ్రోలులోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత 9:45 గంటలకు గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 వరకు అక్కడే ఉండి తిరిగి 1గంటలకు ఆయన నివాసానికి చేరుకుంటారు.
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం తీపికబురు చెబుతుందని డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. మండపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో మంత్రులు గంగిరెద్దుల్లా తలలు ఊపడం తప్పించి ఏమీ చేయలేదని అన్నారు. కూటమి మంత్రులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువులోని MFకన్వెన్షన్ హాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఓటమి చెందిన నేపథ్యంలో కార్యకర్తలు అధైర్య పడకూడదన్నారు. కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదన్నారు.- జక్కంపూడి వ్యాఖ్యలపై మీ కామెంట్..?
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల ఏటిగట్టుపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న తాత, మనవడు మృతిచెందారు. మృతులు మాసా వీర్రాజు (55), పాముల ధనుష్ (12)గా చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఆయన ఇంటిని పార్టీ నాయకులు సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇప్పటికే ఆయన అభిమానులు భారీఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటుచేశారు. ఇంటిపై భారీ బెలూన్ ఎగరేశారు.
కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతిచెందిన ఘటన కాకినాడలో జరిగింది. స్థానికుల వివరాలు.. కాకినాడ జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ చక్రధర్ స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో ఉంటున్నారు. ఆయన కుమారుడు విజయ్ ఉదయం ఇంట్లో ఇంటర్‌నెట్ వైర్ కట్ చేస్తుండగా సడెన్‌గా కరెంట్ రావడంతో షాక్‌తో చనిపోయాడు. కాగా అతను ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫస్ట్‌ఈయర్ చదువుతున్నాడు.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప శివారు చెరువులో గల్లంతైన కాకినాడ రూరల్ మండలం వలసపాకలకు చెందిన తంగెళ్ల అప్పన్న(25) మృతదేహం లభ్యమైంది. కూలీ పనికి వచ్చిన అప్పన్న శనివారం భోజనం అనంతరం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి చెరువుగట్టు పైకి వెళ్లాడు. ముగ్గురులో ఇద్దరు ప్రమాదవశాత్తూ జారి చెరువులో పడిపోయారు. ఒకరిని స్థానికులు రక్షించగా.. అప్పన్న గల్లంతయ్యాడు. అతడి కోసం గాలించగా.. మృతదేహం లభ్యమైంది.
కొవ్వూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ABN డిగ్రీ కాలేజ్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడలోని గాంధీనగర్‌కు చెందిన 14ఏళ్ల విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని ఆమె సోదరుడు మందలించడంతో మనస్తాపం చెంది ఇంట్లో శనివారం ఉరి వేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2 టౌన్ SI చినబాబు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.