EastGodavari

News April 20, 2024

కాకినాడ: వర్మ రుణం తీర్చుకుంటాను: పవన్ కళ్యాణ్

image

కాకినాడ జిల్లాలోని కొత్తపల్లిలో టీడీపీ నేతలతో జనసేన అధినేత పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పిఠాపురం TDP ఇన్‌ఛార్జి వర్మ నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. పిఠాపురంలో వర్మతో కలిసి పనిచేస్తున్నానని.. ఆయన రుణం తీర్చుకుంటానన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే మద్దతిచ్చానని తెలిపారు. నేడు సాయంత్రం కోరుకొండ సభలో ఆయన పాల్గొననున్న విషయం తెలిసిందే.

News April 20, 2024

తూ.గో.: ఈ పెళ్లి పత్రిక DIFFERENT.. ఏంటో చూసేయండి

image

రాజమండ్రికి చెందిన అలికాని సత్యశివకుమార్, దుర్గాభవానీల వివాహం ఈ నెల 21న జరగనుంది. కాగా వారి వివాహ వేడుకకు ఆహ్వానపత్రికను వినూత్నంగా సిద్ధం చేశారు. నిశ్చితార్థం మొదలుకొని 16 రోజుల పండగ వరకు సుమారు 45 ఘట్టాలు, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచారు. పత్రి ఘట్టానికి ఓ క్యూఆర్ కోడ్ రూపొందించి శుభలేఖలో ముద్రణ చేయించారు. కోడ్ స్కాన్ చేస్తే ఆ ఘట్టాన్ని ఎవరైనా చూడొచ్చు.
– మీరు చూశారా ఇలాంటివి.

News April 20, 2024

కొడుకుపై కేసు పెడతారనే భయంతో తల్లి ఆత్మహత్య

image

కొడుకుపై కేసు పెడతారని తల్లి సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ-సూర్యకుమారి HYDలో పనులు చేసుకుంటున్నారు. వీరి కొడుకు(14) బుధవారం బైక్‌తో BMW కారును ఢీకొట్టాడు. కారు రిపేరుకు రూ.20 వేలు ఇవ్వాలని, లేదా కేసు పెడతామని డ్రైవర్ చంద్రశేఖర్, ఫ్రెండ్ మహేశ్ బెదిరించారు. దీంతో సూర్యకుమారి సూసైడ్ చేసుకుంది. పోలీసులు శుక్రవారం ఇద్దరిని అరెస్ట్ చేశారు.

News April 20, 2024

ఉమ్మడి తూ.గో.లో రెండో రోజు 26 నామినేషన్లు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ప్రధాన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామపత్రాలు సమర్పించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా మొత్తంగా 26 నామినేషన్ల రాగా.. తూ.గో జిల్లాలో 12 (MP-1, MLA-11), అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10, కాకినాడ జిల్లాలో 4 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

News April 20, 2024

కందుల దుర్గేష్ మాతృమూర్తి కన్నుమూత

image

ఉమ్మడి తూ.గో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, నిడదవోలు నియోజవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ మాతృమూర్తి మేడా పద్మావతి(78) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని రాజమండ్రిలోని జెండా పంజారోడ్డులో ఉన్న స్వగృహానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. నిడదవోలు టీడీపీ ఇన్‌ఛార్జి బూరుగుపల్లి శేషారావు, తదితరులు దుర్గేష్, ఆయన సోదరుడు గురుదత్త ప్రసాద్‌ను పరామర్శించి సానుభూతి తెలిపారు.

News April 20, 2024

జిల్లాలో 563 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,644 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వాటిలో 563 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని, 1000 మంది ఓటర్లు పైబడిన పోలింగ్ కేంద్రాలు 663 వరకు ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తెలిపారు. 991 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చిత్రీకరణ చేపడుతున్నామన్నారు.

News April 19, 2024

జనసేన అమలాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జి రాజీనామా

image

అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి డీఎంఆర్ శేఖర్ శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని శేఖర్ విడుదల చేశారు. 2019 నుంచి తాను జనసేన పార్టీలో సిన్సియర్ కార్యకర్తగా పని చేశానన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేశానని లేఖలో స్పష్టం చేశారు. అమలాపురం జనసేన టికెట్‌ను శేఖర్ ఆశించారు.

News April 19, 2024

ఎంపీ RRR తరుఫున సతీమణి, కొడుకు నామినేషన్

image

ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. RRR సతీమణి రమాదేవి ఉండి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, తదితరులు ఉన్నారు. రఘురామకు ఎక్కడి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ వీడకపోవడంతో ఆయన తన సతీమణి, కుమారుడితో నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది.

News April 19, 2024

తూ.గో.: 6 సార్లు గెలుపు.. పదవ సారి నామినేషన్

image

తూ.గో. జిల్లాలోని TDP సీనియర్ నేత గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్‌నుంచి నామినేషన్ వేశారు. కాగా గోరంట్లకు నామినేషన్ వేయడం ఆయన రాజకీయ జీవితంలో 10వ సారి కావడం విశేషం. రాజమండ్రి నియోజకవర్గంలో TDP నుంచి 1983లో తొలిసారిగా MLAగా గెలిచారు. ఆ తర్వాత 1985లో గెలుపొందగా 1989లో ఓడిపోయారు. 1994, 1999లో గెలిచి, 2004, 2009లో పరాజయం పొందారు. మళ్లీ రాజమండ్రి రూరల్ ఏర్పడిన తర్వాత 2014, 2019లో గెలుపొందారు.

News April 19, 2024

కాకినాడ: వైసీపీలోకి మాజీ మేయర్

image

కాకినాడ మాజీ మేయర్ సరోజ ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో YCPలో చేరారు. ఈ మేరకు ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ.. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన తనకు జనసేనలో సరైన స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. BC వర్గానికి మెజారిటీ సీట్లు ఇచ్చిన జగన్ వెంట నడుద్దామని నిర్ణయించుకుని పార్టీలో చేరానని తెలిపారు.