India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం జగన్ బస్సుయాత్ర శుక్రవారం ఉదయం 9గంటలకు ఎస్టీ రాజపురం నుంచి బయలుదేరుతుంది. రంగంపేట మీదుగా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రవేశించి, పెద్దాపురం-సామర్లకోట బైపాస్ మీదుగా ఉండూరు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అక్కడినుంచి సాయంత్రం 3:30గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత పిఠాపురం, గొల్లప్రోలు మీదుగా గొడిచర్లక్రాస్ వద్ద రాత్రికి బస చేస్తారు.
తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధి ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి తూ.గో. జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. ప్రధాన పార్టీల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా కాకినాడ జిల్లా నుంచి ప్రధాన పార్టీల నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.
కాకినాడ జిల్లాలో గురువారం జరిగిన << 13079053>>రోడ్డుప్రమాదంలో <<>>ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓకళాశాలలో విశాఖపట్నంకు చెందిన మాధవ్(20), అనకాపల్లికి చెందిన సతీష్(20), శ్రీకాకుళంకు చెందిన రామచంద్రరావు బీటెక్ చదువుతున్నారు. రామేశంపేటలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. పనినిమిత్తం పెద్దాపురం వెళ్లి తిరిగొస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. మాధవ్, సతీష్ అక్కడికక్కడే మృతిచెందారు.
పిఠాపురంలో సినీ నటుడు పృథ్వీరాజ్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకం, ఆయనో పెద్ద దరిద్రం అంటూ మండిపడ్డారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం- రాజమండ్రి ఏడీబీ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కాకినాడకు చెందిన వారిగా తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికల ఖర్చుల పరిశీలనకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించడంతో గురువారం వారు బాధ్యతలు చేపట్టారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సాదిక్ అహ్మద్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ పరిశీలకులుగా యోగేష్ కుమార్, పెద్దాపురం, కాకినాడ, జగ్గంపేట నియోజకవర్గాలకు ఏ.ఆషీఫ్ నియమితులయ్యారు. గురువారం కలెక్టర్ జే.నివాస్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తు బిల్డింగు పై నుంచి కిందపడి షేక్ అసిన్(35) మృతి చెందినట్లు ఎస్సై కే సతీష్ కుమార్ తెలిపారు. మండలంలోని భీమోలు గ్రామంలో ఉదయం10 గంటలకు దాబాపై తాపీ పని చేస్తుండగా దురదృష్టవశాత్తు పై నుండి కింద పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో గోపాలపురం ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
సీఎం జగన్ బస్సు యాత్ర తేతలి నుంచి తణుకు మీదుగా రావులపాలెంలోకి సాగింది. తూ.గో జిల్లాలో సిద్దాంతం వంతెన నుంచి జిల్లాలోకి ప్రవేశించింది. రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వరకు బస్సుయాత్ర సాగనుంది. ఎస్టీ రాజపురంలో రాత్రి సీఎం జగన్ బస చేయనున్నారు. అందరికి అభివాదం చేస్తూ
సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు.
రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని మోరంపూడి గాయత్రి నగర్‌కు చెందిన సుంకర నారాయణ(19) ప్రేమ విఫలమై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ ఎండీ ఉమర్ బుధవారం తెలిపారు. 10 తరగతి వరకు చదివిన నారాయణ రోజువారి కూలి పనులు చేసుకుంటూ ఉంటాడన్నారు. గత కొద్ది రోజుల నుంచి తీవ్ర మనస్తాపంతో ఉంటున్నాడని, ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.