India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థులను బుధవారం ఆ పార్టీ ప్రకటించింది. ఏలేశ్వరంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నైనాలశెట్టి మూర్తి ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. కాకినాడ ఎంపీగా బుగతా బంగార్రావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఏగుపాటి అర్జునరావు, తుని ఎమ్మెల్యే స్థానానికి శివ పోటీ చేస్తారని ఆయన చెప్పారు.
జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 పార్లమెంటు, 21 అసెంబ్లీ నియోజకవర్గల నామినేషన్ల స్వీకరణకు ఎన్నికలు సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. లోక్‌సభ అభ్యర్థి రూ.25,000 వేలు, ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.10,000 వేలు ధరావత్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 % ధరవత్తు ఉంటుంది.
ఎన్నికల విధులు నిర్వహించే ఓపిఓ , మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు రాజమహేంద్రవరం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో ఫారం 12 సేకరణ కేంద్రం ఏర్పాటు చేసామని టర్నింగ్ అధికారి, జెసి తేజ్ భరత్ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు పోస్టల్ బ్యాలెట్ సేకరణ కేంద్రంలో ఫారం-12, ఎన్నికల విధుల ఉత్తర్వు పత్రం, ఆధార్, గుర్తింపు కార్డు అందించాలన్నారు.
మాదాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గుత్తుల శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.70 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్యకుమార్ గతేడాది డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడి జైలుకు పంపారు. అయినా అతనిలో మార్పు రాలేదు.
ఉమ్మడి తూ.గో జిల్లాలోకి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రవేశించనుంది. ప.గో జిల్లా తణుకులో గురువారం ప్రారంభమయ్యే యాత్ర పెరవలిలో తూ.గో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, జొన్నాడ మీదుగా కడియం చేరుతుంది. మధ్యాహ్నం కడియపులంకలో భోజనం అనంతరం మోరంపూడి కూడలి మీదుగా రాజమండ్రి నగరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే రాజానగరం నియోజకవర్గంలోకి వెళ్లనుంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 377 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. సాధారణ రకం క్వింటాలుకు రూ.2,183, గ్రేడ్-ఏ రకం రూ.2,203 మద్దతు ధర ఇస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యలను, ఫిర్యాదులను 1800 425 2532 నంబర్ కు కాల్ చేసి చెప్పాలన్నారు.
తూ.గో జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అనుగుణంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటి చేసే అభ్యర్ధులు ఆయా కలెక్టరేట్‌లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాలన్నారు.
కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి కొటారు అశోక్ బాబా, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు లంకసాని శ్రీనివాసరావు బుధవారం రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఇద్దరు నాయకులు త్వరలో టీడీపీలో చేరతామని వెల్లడించారు.
బిక్కవోలు మండలం కొమరిపాలెంలో కాలువలోకి దిగి ఓ యువకుడు గల్లంతైన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మహేష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బిక్కవోలు మండలం కొమరిపాలెం వెళ్లారు. స్నేహితులతో కలిసి కాలవలోకి దిగిన మహేష్ గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సామర్లకోట పశ్చిమ ఏలేరు కాలువలో మృతదేహం అలజడి సృష్టించింది.గుర్రపు డెక్కల మధ్య మృతదేహం ఉన్నట్లు పశువుల కాపర్లు గుర్తించి, స్థానికులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మహిళ మృతదేహంగా గుర్తించారు. సామర్లకోట సీఐ సురేష్ ఎస్‌ఐ మౌనిక మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఇటీవల సామర్లకోటలో ఒక వివాహిత అదృశ్యమైనట్లు ఫిర్యాదు రావడం, మృతదేహం లభించడంతో అదృశ్యమైన మహిళదిగా భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.