EastGodavari

News June 25, 2024

అమలాపురం: బాలికపై అత్యాచారం..15 ఏళ్లు జైలు

image

మైనర్ బాలికను గర్భవతి చేసిన నిందితునికి 15 సంవత్సరాల జైలు శిక్ష రూ.7వేల నగదు జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. అమలాపురం మద్దాల వారి పేటలో 2018 ఏప్రిల్ 2న తల్లిదండ్రులు లేని సమయంలో మైనర్ బాలికకు మత్తు పానీయాలు ఇచ్చి గణపతి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు.

News June 25, 2024

తూ.గో: GOOD NEWS.. 3 రైళ్ల పునరుద్ధరణ

image

రాజమండ్రి స్టేషన్ మీదుగా రద్దు చేసిన 26 ట్రైన్లలో 3 రైళ్లను రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచి విశాఖ-లింగంపల్లి మధ్య జన్మభూమి ఎక్స్‌ప్రెస్ యధావిధిగా నడవనుంది. అలాగే కాకినాడ పోర్ట్-పాండిచ్చేరి మధ్య సర్కార్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు-విజయవాడ మధ్య మెమూ ఎక్స్‌ప్రెస్‌లను కూడా యధావిధిగా నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
➠ SHARE IT..

News June 24, 2024

కోనసీమ: పోలీస్ స్టేషన్‌కు చేరిన కొబ్బరి చెట్ల గొడవ

image

మామిడికుదురు మండలం నగరం గ్రామంలో సరిహద్దులోని కొబ్బరి చెట్ల విషయమై ఘర్షణకు దిగిన 2 కుటుంబాలపై కేసులు నమోదు చేశామని ఎస్సై సురేష్ సోమవారం తెలిపారు. నగరం కొత్త రోడ్డుకు చెందిన వెలుగొట్ల సూర్యకుమారి ఫిర్యాదు మేరకు ఒక కేసు.. వెలుగొట్ల విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశామన్నారు. 2 కుటుంబాలు సరిహద్దులోని కొబ్బరి చెట్ల విషయంలో గొడవపడి గాయపడ్డారన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు SI తెలిపారు.

News June 24, 2024

రాజమండ్రి: అర్జీలు స్వీకరించిన ఎస్పీ జగదీష్

image

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం (పీజీఆర్ఎస్)’ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో తూ.గో జిల్లా ఎస్పీ పి.జగదీష్ సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను ఎస్పీ జగదీష్ స్వయంగా పరిశీలించి స్వీకరించారు. ప్రజా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు.

News June 24, 2024

రాజమండ్రి: గుడ్ న్యూస్.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ

image

రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి 23 రైల్వే సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కడియం- నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ నేపథ్యంలో ఆగస్టు 11 వరకు రత్నాచల్, సర్కార్, తదితర ముఖ్యమైన 23 రైళ్లను నిలిపివేశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఈ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల అభ్యర్థన మేరకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

News June 24, 2024

మూడునాలుగు రోజుల్లో పిఠాపురానికి పవన్ రాక

image

మూడు, నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ఆదివారం ఆయన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పట్టణ శివారులోని ఇల్లింద్రాడ వద్ద ఓ రైస్‌మిల్లులో సమావేశమయ్యారు. పవన్ పిఠాపురం ప్రజలను కలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారని తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా, 5 శాఖల బాధ్యతలు ఆయనపై ఉన్నాయని, వాటికి న్యాయం చేస్తూనే నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో తూ.గో. జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు పవన్ కళ్యాణ్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

తూ.గో.: ALERT.. 4 రోజులు వర్షాలు

image

నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం కాకినాడ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.☛ SHARE IT

News June 24, 2024

పిఠాపురం: ప్రైవేట్ టీచర్ల సమస్యలపై వర్మ హామీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రైవేటు టీచర్ల సమస్యలు తీసుకెళ్తానని మాజీ MLA ఎస్వీఎస్ఎస్ వర్మ చెప్పారు. పిఠాపురం మమతా హైస్కూల్లో ఆదివారం జరిగిన ప్రైవేట్ టీచర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కూడా సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News June 24, 2024

తూ.గో.: యువతికి వేధింపులు.. కేసు నమోదు

image

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన పండు కొంతకాలంగా ఓ యువతి వెంటపడి తిరుగుతున్నాడు. ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఆమె సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు ఆదివారం తెలిపారు.