India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రైవేటు టీచర్ల సమస్యలు తీసుకెళ్తానని మాజీ MLA ఎస్వీఎస్ఎస్ వర్మ చెప్పారు. పిఠాపురం మమతా హైస్కూల్లో ఆదివారం జరిగిన ప్రైవేట్ టీచర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కూడా సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సినీ డైరెక్టర్ హను రాఘవపూడి ఈరోజు దర్శించుకున్నారు. నూతనంగా ప్రభాస్‌తో చిత్రీకరిస్తున్న సినిమా స్క్రిప్ట్‌కు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో సఖినేటిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముప్పర్తి నాని, వనమాల మూలస్వామి, శంకరగుప్తం నాని, తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురంలోని వీరరాఘవపురంలో గోవధ జరుగుతుందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి తనకు వీడియో పంపినట్లు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ‘X’లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తమ MLA, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చేరవేయాలని కోరినట్లు తెలిపారు. ఈ ఘటన నిజమే అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చేలోపు అధికారులు చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ కోరారు.
➠ NOTE: అభ్యంతరకరంగా ఉన్న దృష్ట్యా వీడియో అప్‌లోడ్ చేయలేదు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఏడాది మార్చి 2వ తేదీన రూ.51.48 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ శిలాఫలకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లు రాష్ట్రంలో రాక్షసపాలన సాగిందని, వ్యవస్థలను మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్వంసం చేశారని, రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టారని, మీడియాని అణచివేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలు పాటించకపోవడంతో, ప్రజలు వారికి బుద్ధి చెప్పి 11 సీట్లే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో రాజమండ్రి రూరల్, కాకినాడ, కోనసీమ, సామర్లకోట, పెద్దాపురం, రాజానగరం ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.☛ SHARE IT
కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్ పనులు వేగవంతం చేయడానికి కేంద్రం నుంచి నిధుల విడుదలకు కృషిచేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పేర్కొన్నారు. లోక్‌సభ టీడీపీ విప్‌గా పార్టీ అధినేత చంద్రబాబు నియమించిన సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ .. తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా సెంట్రల్ కాయర్ బోర్డ్ ద్వారా పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు.
కాకినాడ జిల్లాలో అతిసారం విజృంభిస్తోంది. పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండగా.. శనివారం ఓ మహిళ మృతి సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. తొలుత తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడిలో ప్రభలిన ఈ వ్యాధి.. ఇప్పుడు సామర్లకోట మండలం వేట్లపాలెం జొన్నలదొడ్డి ప్రాంతానికి విస్తరించింది. 3 రోజుల్లో 31 మంది దీని బారినపడగా.. 15మంది ఆసుపత్రిలో చేరారు. మరోవైపు అధికారులు గ్రామాల్లో వైద్యశిబిరాలతో చికిత్స అందిస్తున్నారు.
➤ తూ.గో కలెక్టర్ కె.మాధవీలత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న పి.ప్రశాంతి కలెక్టర్‌గా రానున్నారు. మాధవీలత జీఏడీకి రిపోర్ట్ చేస్తారు.
➤ కాకినాడ కలెక్టర్ జె.నివాస్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చిత్తూరు కలెక్టర్‌గా ఉన్న షన్మోహన్ రానున్నారు. నివాస్ జీఏడీకి రిపోర్ట్ చేయనున్నారు.
యువకుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన శనివారం తాళ్లపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీరన్నస్వామి(26) రాజమండ్రిలోని దివాన్ చెరువు నుంచి వచ్చి తాళ్లపూడిలోని ఓ హోటల్‌లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. కారణమేంటో తెలియదు గానీ వీరన్న సూసైడ్ చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొవ్వూరు తరలించినట్లు ఎస్సై శ్యామ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.