India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో. నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం శివారులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవీంద్ర (24) ఆదివారం స్నేహితులతో కలిసి పొలం వెళ్లగా తల్లి ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. ఈ క్రమంలో బైపాస్‌పై బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. అంబులెన్స్‌లో నల్లజర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
పాయకరావుపేటలో టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కాపు సంఘం నాయకుడు ఆకుల షణ్ముఖరావును చంద్రబాబుకు పరిచయం చేసి టీడీపీలో చేర్పించారు. ఈ మేరకు షణ్ముఖరావుకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
గత ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి విషయంలోనూ అందరూ ముందు దాడి అన్నారని, ఆ తర్వాత డ్రామా అన్నారని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాజమండ్రిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరిగిన దాడి కూడా నిజంగా జరిగిందా లేదా ఓట్ల సానుభూతి కోసం చేయించారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీచేసే విషయంపై ఆలోచిస్తానన్నారు.
ఈ నెల 19వ తేదీన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగే మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయాలని కె.గంగవరం మండల కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపట్టిన సిద్ధం బస్సు యాత్రకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక పార్టీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడి హేయమైన చర్యని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో ఆదివారం సీఆర్సీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందడం చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నారన్నారు. దాడి నేపథ్యంలో ఈ నెల 18న రావులపాలెంలో జరగనున్న సిద్ధం సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్‌తో గీసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటం విశేషంగా ఆకట్టుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన యార్లగడ్డ రాజారావు రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 విభాగాలు, 128 సవరణలతో అంబేడ్కర్ చిత్రపటం రూపొందించారు. ఈ చిత్రపటాన్ని 2 రోజుల 11గంటల వ్యవధిలో గీసినట్లు రాజారావు చెప్పారు. రాజారావును పలువురు అభినందించారు.
వినూత్న ఆలోచనలతో ఎవరి అభిరుచికి తగినట్లు వారు శుభలేఖలు తయారు చేయించుకుంటున్న కల్చర్ ఈ మధ్య ఎక్కువైంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మొబైల్ రిపేర్ షాపు యాజమాని ఒకరు ఇలాగే సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్లు పెళ్లికార్డు ముద్రించుకున్నారు. అమలాపురం బ్యాంక్ స్ట్రీట్‌లో సెల్‌ఫోన్ రిపేర్ షాపు నిర్వహిస్తున్న అంబాజీపేట మండలం జి.అగ్రహారానికి చెందిన మణి-మధురిమ పెళ్లికార్డు అచ్చం ఫోన్‌ను పోలినట్లు ఉంది.
విజయవాడలో సీఎం జగన్ మీద జరిగిన దాడి పూర్తిగా ప్రతిపక్షాల కుట్రేనని హోంమంత్రి వనిత ఆరోపించారు. శనివారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాడికి కారణం అయిన ఏ ఒక్కరిని విడిచి పెట్టబోమని, ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని, దేవుడి ఆశీసులు జగన్‌కు, వైస్సార్సీపీ ప్రజా ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. రాజానగరానికి చెందిన హోంగార్డు కెల్లా సురేంద్ర(33) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. ఉదయమే విధుల నిమిత్తం రాజమండ్రికి వెళ్లిన ఆయన.. హాజరు పట్టికలో సంతకం పెట్టే సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాకినాడ జిల్లా శంఖవరం శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కె.దొరబాబు(35) అనే వ్యక్తి కత్తిపూడి వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అతనికి భార్య, మూడేళ్ల లోపు వారు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.