India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 16,16,918 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,89,443, మహిళలు 8,27,380, ఇతరులు 95 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 19,726 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,533 మంది కాగా.. మహిళలు 8,192 మంది ఇతరులు ఒకరు ఉన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్లు వయస్సు దాటిన వారు మొత్తం 8,284 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,536 మంది కాక మహిళలు 4,748 మంది ఉన్నారు.
బీసీలంతా సమష్టిగా కృషిచేసి రాజమండ్రి పార్లమెంటులో బీజేపీని గెలిపించి మోడీకి గిఫ్టుగా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధీశ్వరి పిలుపునిచ్చారు. BJP ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరామ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో శనివారం ఆమె పాల్గొని మాట్లాడారు.
సీఎం జగన్‌పై రాయితో దాడి చేయడం పిరికిపందల చర్య అని, ఇది టీడీపీ వ్యూహమని ఎంపీ, రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద బస్సుపై నుంచి సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. పూలతోపాటు రాయిని దుండగులు విసరడంతో సీఎం ఎడమ కంటి కనుబొమ్మకు బలమైన గాయమైందన్నారు.
2019లో గెలుపొందిన పలువురు MLAలకు ఈ సారి టికెట్ రాకపోవడంతో ఉభయ గోదారిలో రాజకీయం వేడెక్కింది. చింతలపూడిలో YCP MLA ఎలీజాను మార్చగా ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకొన్నారు. పి.గన్నవరం YCP MLA చిట్టిబాబుకు సైతం టికెట్ ఇవ్వకపోగా ఆయనా కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఉండిలో TDP సిట్టింగ్ MLAకు ఆ పార్టీ తొలుత టికెట్ ఇచ్చినా.. ఇతరులకు కేటాయిస్తారనే టాక్‌తో సందిగ్ధత నెలకొంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఓ లాడ్జిలో యువకుడు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కరప మండలం వేళంగికి చెందిన అనిల్‌కుమార్(25) క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటయ్యాడు . దానికి తోడు చెడు వ్యసనాలకు బానిస కావడం, బెట్టింగ్ కారణంగా అప్పులు ఎక్కువ కావడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. శుక్రవారం లాడ్జిలో రూం తీసుకున్న అనిల్.. ఆత్మహత్య చేసుకున్నట్లు SI తెలిపారు.
పి.గన్నవరం MLA కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్‌లో చేరారు. మామిడికుదురు మండలం నగరంలో జన్మించిన చిట్టిబాబు.. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌లో ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడగా.. 2019లో TDP అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై గెలిచారు. ఈసారి వైసీపీ టికెట్ దక్కక అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు.. ఈరోజు హస్తం గూటికి చేరారు. చిట్టిబాబు నిర్ణయంతో వైసీపీకి నష్టమెంత..? కాంగ్రెస్‌కు కలిసొచ్చేదెంత.? కామెంట్..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సామర్లకోట పట్టణంలో ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.12,67,611 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు మొత్తాలను జిల్లా ట్రెజరీకి అప్పగించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి జాస్తి రామారావు తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, తదితదరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిందో విద్యార్థిని. కాకినాడ PR ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుతున్న డి.సాయిలక్ష్మి 1000కి గానూ 991 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో సాయిలక్ష్మి స్తతా చాటగా.. గ్రామస్థులతో పాటు అధ్యాపకులు ఆమెను అభినందించారు.
ఆర్థిక ఇబ్బందులతో భీమవరానికి చెందిన కిషోర్‌కుమార్(32), అతని భార్య యోచన(24) కుమార్తె నిధిశ్రీ(2)తో చించినాడ వశిష్ఠ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. గురువారం కిషోర్ మృతదేహం.. శుక్రవారం తల్లీ, కుమార్తె మృతదేహాలు దొరికాయి. పాలకొల్లులో పోస్టుమార్టం చేశారు. మరణంలోనూ పేగు బంధాన్ని వీడలేక యోచన చున్నీతో కుమార్తెను కట్టేసుకొని దూకినట్లు తెలుస్తోంది. వీరు కొద్దిరోజులుగా అమలాపురంలో ఉన్నారు.
ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారి NSVL నరసింహం తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..
Sorry, no posts matched your criteria.