India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనపర్తి టికెట్ TDPకి ఇచ్చేందుకు BJP అంగీకరించినట్లు తెలిసింది. శుక్రవారం చంద్రబాబు, పవన్, పురందీశ్వరి సమావేశమైన విషయం తెలిసిందే. అనపర్తి టికెట్ ముందు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే ఇవ్వగా.. తర్వాత BJPకి దక్కింది. అసంతృప్తి వ్యక్తం కావడంతో అనపర్తికి బదులు అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె టికెట్ BJP తీసుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామని BJP నేతలు అన్నారట.
వేసవి నేపథ్యంలో సీజనల్ పండ్లకు గిరాకీ పెరిగింది. ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రధానంగా పుచ్చకాయల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజానగరం, దివాన్ చెరువు, రావులపాలెం, అమలాపురం, కాకినాడల్లోని ఉపకేంద్రాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 2టన్నుల మేర పండ్ల అమ్మకాలు సాగుతుండగా రూ.కోట్లలో టర్నోవర్ లభిస్తోంది. సపోటా, రామాఫలం, గులాబీ జామ్, చింతకాయలపల్లి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.
ఉమ్మడి తూ.గో.జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 13, 14వ తేదీల్లో పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 13న తూ.గో. జిల్లాలోని 6, కాకినాడ జిల్లాలో 5 మండలాల్లో వడగాలులు ఉంటాయని తెలిపింది. 14న తూ.గో జిల్లాలో 18 మండలాలు, కాకినాడ జిల్లాలో 11 మండలాలు, కోనసీమలో 9 మండలాల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మండపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిని మారుస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో అమలాపురంలోని కిమ్స్‌లో మండపేట జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ, ఎమ్మెల్యే జోగేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడారు. మండపేట కూటమి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావే ఉంటారని స్పష్టం చేశారు. లీలాకృష్ణ రాజకీయ భవిష్యత్తును అధికారంలోకి రాగానే చూసుకుంటామన్నారు.
మాజీ ఎంపీపీ, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, వైసీపీ నాయకుడు అడబాల సూర్యనారాయణ (బాబ్జీ)కి సతీవియోగం కలిగింది. ఆయన భార్య రామలక్ష్మి అనారోగ్యంతో (45) గురువారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతి పట్ల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారిన అనపర్తి, ఉండి టికెట్లపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లోకేశ్, జనసేన అధినేత పవన్, బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి, సిద్ధార్థ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు అనపర్తి, ఉండి టికెట్లపైనా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి తూ.గో వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: తూ.గోలో 19,039 మందికి గానూ 14,357 మంది(75%).. కాకినాడలో 19,656 మందికి 11,873 మంది(60%).. కోనసీమలో 10,745 మందికి 6,444 మంది (60%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: తూ.గోలో 15,394 మందికి గానూ 12,837 మంది (83%).. కాకినాడలో 15,969 మందికి 11,337 మంది(71%).. కోనసీమలో 8,844 మందికి 6,338 మంది (72%) పాసయ్యారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 75 శాతం(ఉత్తీర్ణత)తో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 83 శాతంతో 5వ స్థానంలో ఉంది.
➠ కాకినాడ జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 60 శాతంతో 15వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 71 శాతంతో 18వ స్థానంలో నిలిచింది.
➠ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 60 శాతంతో 17వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 72 శాతంతో 16వ స్థానంలో నిలిచింది.
ఉమ్మడి తూ.గో ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 25,256 మంది, తూ.గో-41,382 మంది, కాకినాడ జిల్లాలో 44,179 మంది ఫస్ట్, సెంకడ్ ఇయర్ విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాశారు. గతేడాది ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి తూ.గో జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 6వ, సెకండ్ ఇయర్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి కొత్త జిల్లాల వారీగా ఫలితాలు వెలువడనుండగా.. ఏ జిల్లా ఏ స్థానంలో నిలువనుందో..?
కాకినాడ జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 8కిలోల బంగారం, 46కిలోల వెండి పట్టుబడింది. ఆభరణాలతో వెళుతున్న వాహనాన్ని పెద్దాపురం పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంలో ఎలాంటి పత్రాలు లేకుండా వాటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాకినాడ నుంచి విశాఖ వెళ్తూ మధ్యలో పెద్దాపురంలోని ఓ నగల దుకాణానికి రావడంతో డీఎస్పీ లతాకుమారి ఆదేశాల మేరకు సీఐ రవికుమార్, ఎస్ఐ సురేష్ ఆ వాహనం, నగలను స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.