EastGodavari

News April 10, 2024

తూ. గో:ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్‌మోహన్ మిశ్రా రాక

image

ఎన్నికల నేపథ్యంలో తూ.గో జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం రాత్రి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రాంమోహన్ మిశ్రా రాజమహేంద్రవరం చేరుకున్నారు. జిల్లాలో పరిశీలన నిమిత్తం విచ్చేసిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రాకు పొట్టి లంక చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే.మాధవీలత, జిల్లా ఎస్పీ పి.జగదీశ్‌లు మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందచేశారు.

News April 10, 2024

తుని: రైలు నుంచి పడి గుర్తుతెలియని మహిళ మృతి

image

రావికంపాడు – అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని మహిళ బుధవారం రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు 5అడుగులు ఎత్తు కలిగి పచ్చని చీర కట్టుకుని ఉంది. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో తరలించారు. ఆమె ఆచూకీ తెలిసినవారు తుని రైల్వేపోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్సై లోవరాజుని సంప్రదించాలని కోరారు.

News April 10, 2024

12న ఈవీఎంల రాండమైజేషన్: కలెక్టర్

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సిబ్బందితో శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాండమైజేషన్ ప్రక్రియపై ఆయన వారికి అవగాహన కల్పించారు.

News April 10, 2024

కిర్లంపూడి: పవన్‌కు ముద్రగడ సవాల్

image

జనసేన అధినేత పవన్ మగాడయితే.. నేరుగా తనమీద మాట్లాడాలంటూ YCP నాయకులు ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ‘పవన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పవన్ హైదరాబాద్‌లో పుట్టారు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చి పవన్ MLA కావాలనుకోవడం ఎంత వరకు సబబు?’ అని ప్రశ్నించారు.

News April 10, 2024

అమలాపురం MLA అభ్యర్థి ప్రకటన

image

రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి పాలమూరి మోహన్ పోటీ చేస్తారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి తెలిపారు. ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామానికి చెందిన మోహన్ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. పార్టీ ఆశయాల పట్ల ఆకర్షితులై ఇటీవల బీఎస్పీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో నియోజవర్గంలో మోహన్‌ను గెలిపించాలని కోరారు.

News April 10, 2024

తూ.గో: 2 నెలలు బంద్..కారణం ఇదే..!

image

తూ.గో జిల్లాలో ఈనెల 15 నుంచి జూన్ 16 వరకు అన్ని రకాల చేపల వేటలు నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి వాటి సంతతిని ప్రోత్సహించడమే ఉద్దేశమన్నారు. ఉత్తర్వులు ధిక్కరించి చేపల వేటకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 10, 2024

తూ.గో: ఒక్క తునిలోనే 174 మంది మృతి

image

తూ.గో జిల్లాలో ప్రభుత్వ రైల్వే పోలీస్ శాఖ రైలు ప్రమాదాల్లో మృతుల నివేదికను వెలువరించింది. ఒక్క తుని స్టేషన్‌లోనే 2022 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 5వ వరకు 174 మంది మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కశింకోట- పిఠాపురం వరకు మృతి చెందిన వారిలో 49 మంది ఎవరో కూడా తెలియకుండానే ఖననం చేశారు. ఇక మీద ప్రమాదాలు జరగకుండా రైళ్లు, ఫ్లాట్ ఫామ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని తుని జీఆర్పీ ఎస్సై అబ్దుల్ మారూఫ్ తెలిపారు.

News April 10, 2024

తూ.గో: 70 కేసులు ఉన్న దొంగ అరెస్ట్

image

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డ యూనియన్ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తెచ్చిన వృద్ధురాలు వాకా కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.

News April 10, 2024

ఎన్నికల కోడ్.. అనపర్తిలో రూ.6.75 లక్షలు స్వాధీనం

image

అనపర్తికి చెందిన కాంట్రాక్టరు సతీష్‌ రెడ్డి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి కారులో వెళ్తుండగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద తనిఖీల్లో రూ.6.75 లక్షల నగదును మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును పోలీసులు తనిఖీ చేయగా.. రూ.6.75 లక్షల నగదు ఉంది. వాటికి సంబంధించిన ఎటువంటి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కె.గోవిందరావు తెలిపారు.

News April 9, 2024

జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల రామస్వామి

image

జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల రామస్వామి (బాబు) నియమితులయ్యారు. పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న రామస్వామికి టికెట్‌ దక్కపోవడంతో ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా ఉన్న పాఠంశెట్టి సూర్యచంద్రను తొలగించి.. తుమ్మలపల్లి రమేశ్‌ను నియమించారు. కాకినాడ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా తోట సుధీర్ నియమితులయ్యారు.