India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. చేబ్రోలులో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంవత్సరమంతా బాగుండాలని, ముఖ్యంగా రైతన్నకు అభివృద్ధి ఉండాలన్నారు. అంతేగాక రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని కూడా స్ధాపించబోతున్నామని తెలిపారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం గొల్లప్రోలు పట్టణ శివారులో గల హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు జనసేన నాయకులు స్వాగతం పలికారు. గొల్లప్రోలు హైవే మీదుగా చేబ్రోలులోని ఆయన నివాసం ఉండబోయే ఇంటికి రహదారి మార్గంలో చేరుకోనున్నారు. మరి కాసేపట్లో చేబ్రోలులో పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేయనున్న నేపథ్యంలో వ్యక్తిగత బలగాలతో పాటు పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు.
పి.గన్నవరానికి చెందిన షేక్ కాజా 45 అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని ఎస్సై శివకృష్ణ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. చికెన్ షాప్‌లో పనిచేసే కాజా గత నెల 31 నుంచి షాపు మూతపడటంతో తరచూ మద్యం తాగుతున్నాడన్నారు. ఈ నెల 4న కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లారని, పి.గన్నవరంలో ఒక భవనంలో వీరు అద్దెకుంటున్నారని చెప్పారు. సోమవారం దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా కాజా మృతదేహం కుళ్ళిపోయి ఉందన్నారు.
ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా రంపచోడవరం సీపీఎం అభ్యర్థిగా లోతా రామారావుకు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, రంపచోడవరం నుంచి వైసీపీ బరిలో నాగులపల్లి ధనలక్ష్మీ ఉండగా.. కూటమి అభ్యర్థిగా మిర్యాల శిరీషా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జరగనున్న ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు గొల్లప్రోలు హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి చేబ్రోలులో ఏర్పాటు చేసిన నివాసానికి చేరుకుంటారు. అనంతరం ఇంటిలోకి కొబ్బరికాయ కొట్టి ప్రవేశిస్తారు. ఇప్పటికే చేబ్రోలు నివాసం వద్ద పవన్ కల్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది మొహరించారు.
యలమంచిలి మండలం కలగంపూడి పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి కొబ్బరిదింపు కార్మికులు కాజ గ్రామం వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోనసీమలోని గుడిమూడిలంకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. యలమంచిలి SI శివనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలని అనుకునేవారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నిబంధనల ప్రకారం నిర్దేశించిన వారంతా 15 రోజుల ముందు నుంచే ఇంటి వద్ద నుంచి ఓటు వేయొచ్చన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అమలాపురంలో 15,18,108 మంది, రాజమహేంద్రవరంలో 16,08,504 మంది, కాకినాడలో 16,11,031 మంది ఓటర్లున్నారు. వీరిలో కనీసం లక్ష మందైనా ఇంటి నుంచి ఓటింగ్ విధానంలో పాల్గొంటారని అధికారులు అంటున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 672 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా సోమవారం కొత్తపేట మండలం మోడెకూరు గ్రామ సచివాలయం-1, 2కు చెందిన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వారి రిజైన్ లెటర్స్‌ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు.
కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అమలాపురం పట్టణాల్లో ఈ నెల 11వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సభ నిర్వహణకు ముందు ఇరుపార్టీల ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.