India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడలో గతంలో పనిచేసిన ఓ ఏఎస్పీపై జిల్లాకు చెందిన ఓ మహిళ ఆదివారం DGPకి ఫిర్యాదుచేసింది. బాధితురాలి వివరాలు.. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై 2022లో కాకినాడ 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాచేశానన్నారు. చర్యలు తీసుకోకపోగా ASPని ఆశ్రయించగా న్యాయం చేస్తానని చెప్పి.. లైంగికంగా వేధించారని చెప్పింది. DGP విచారణకు ఆదేశించగా ఏలూరు ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ సాగుతున్నట్లు సమాచారం.
షటిల్ ఆడుతుండగా కుప్పకూలి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. వివరాలు.. తుని పట్టణానికి చెందిన నగల దుకాణదారుడు ఆళ్లనాగు(49) సోమవారం ఉదయం స్థానిక రాజా క్రీడామైదానంలోని ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడేందుకు వెళ్లాడు. ఆట మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపట్ల శ్రీరాజా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి, అనపర్తి, కాకినాడ జిల్లా పరిధిలో సామర్లకోట, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జరిగిన ప్రాంతాల్లో సగటు దిగుబడి 50 బస్తాలు (బస్తా 75 కేజీలు, 37.5 క్వింటాళ్ల) వరకు వస్తోంది. కొన్నిచోట్ల 55 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. మరో 10 రోజుల్లో రబీ కోతలు జోరందుకోనున్నాయి.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాజమండ్రిలో 45.0 ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే 2వ అత్యధికం. కాగా కాకినాడ జిల్లాలోని 6, కోనసీమ- 4, తూ.గో. జిల్లాలోని 15 మండలాల్లో వడగాల్పులకు ఆస్కారం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. – మీ వద్ద ఎలా ఉంది..?
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆదివారం జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ.. భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధినేత పొత్తు నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమైందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక చేతితో రూపాయి ఇస్తూ.. మరో చేతితో రూ.10 లాగేసుకుంటున్నారని ఆరోపించారు.
పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేనాని పవన్.. ఆయన స్థానికంగా అందుబాటులో ఉండేందుకు వసతితో పాటు పార్టీ కార్యాలయం కోసం చేబ్రోలులో భవనం ముస్తాబవుతోంది. తుది మెరుగులు దిద్దికుంటోంది . ఉగాది వేడుకలకు పిఠాపురంలోనే ఉండనున్న పవన్.. అదే రోజు ప్రత్యేక పూజలు చేసి గృహప్రవేశం చేస్తారని టాక్. ఈ నేపథ్యంలో చేబ్రోలులోని భవంతి విద్యుత్ దీపకాంతుల్లో మిరుమిట్లుగోల్పుతోంది.
అమలాపురంలో ఓ బాదం చెట్టుపై వినాయకుడి లాంటి ఆకారం ఉన్న ఫొటో వైరల్‌గా మారింది. లయన్స్ హాల్ పక్కన ఖాళీ స్థలంలో బాదం చెట్టుపై వినాయకుడి రూపం కనిపించిందని స్థానికులు తెలిపారు. ఈ విషయం ప్రచారం కావడంతో ఆ చెట్టును చూసేందుకు జనం తరలివచ్చారు. లయన్స్ క్లబ్‌లో జరుగుతున్న జాతీయ కవి సమ్మేళనానికి వచ్చిన కవులు వినాయకుడి రూపాన్ని గుర్తించారు.
రాజకీయ ఉద్దండుల కోటగా పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లు గత ఆరేళ్లుగా భిన్న తీర్పును ఇస్తున్నారు. 1994 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. 1994, 1999లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీకి పట్టం కట్టారు. ఒక్కోపార్టీకి 2 సార్లు అవకాశం ఇస్తూ వచ్చిన జగ్గంపేట ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి మరి.
– మీ కామెంట్ ఏంటి..?
కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ దుక్కిపాటి విజయచంద్రను ప్రకటించింది. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ తనను ఎంపిక చేశారని వెల్లడించారు. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక గ్రామ పరిధి రామాలయ పేటకు చెందిన విజయచంద్ర బీటెక్ చదివారు.
తూర్పు గోదావరి జిల్లాలో లబ్ధిదారులకు శనివారం నాటికి 98.78 శాతం పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ మాధవి లత తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 2,43,831 మంది పెన్షన్ దారులకు రూ.72,39,79,500 అందించాల్సి ఉందని ఆమె తెలిపారు. 98.78శాతం పూర్తి కాగా.. మిగిలిన వారికీ వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.