India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
3 రోజుల కింద జనసేనకు రాజీనామా చేసిన అమలాపురం ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసిన రాజాబాబు 45వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టికెట్ TDPకి ఇవ్వడంతో అసంతృప్తికి లోనయ్యారు. చివరకు ఈ రోజున వైసీపీ గూటికి చేరారు.
పవన్ 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అయిపోతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. శనివారం తణుకులో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా ..?అని అడిగారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. ఏలేశ్వరం వాసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని పెద్దవీధికి చెందిన అశోక్(25), మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించరనే భయంతో శుక్రవారం నర్సీపట్నంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారస్థితిలో పడి ఉండగా.. కాకినాడకు తరలించి వైద్యం అందిస్తుండగా వారిద్దరూ మృతి చెందారు. దీంతో విషాదం నెలకొంది.
కాకినాడ జిల్లా ఏటమొగకు చెందిన 9 మంది మత్స్యకారులు ఈ నెల 24న చేపల వేటకు శ్రీదుర్గాభవాని బోటులో బయలుదేరారు. శుక్రవారం విశాఖతీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో వేట సాగిస్తుండగా జనరేటర్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ నౌక (వీర) వెంటనే అక్కడికి చేరుకొని మత్స్యకారులను రక్షించింది. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. ధర్మారావు, సత్తిబాబుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2వ విడత పర్యటన ఖరారైంది. 7వ తేదీన అనకాపల్లి, 8వ తేదీన యలమంచిలిలో పర్యటించి అక్కడ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం 9వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 9వ తేదీ అనంతరం షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని సినీ హీరో అశ్విన్ బాబు దర్శించుకున్నారు. ముందుగా శ్రీ స్వామి వ్రతాన్ని ఆచరించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆశీర్వాదం పొందారు. దేవస్థానం పీఆర్‌ఓ కృష్ణారావు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. హీరో అశ్విన్ దేవస్థాన అన్నదానానికి విరాళం ఇచ్చారు. అశ్విన్ ప్రస్తుతం విశాఖపట్నం లో షూటింగ్ నిమిత్తం వచ్చినట్లు తెలిపారు.
కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో ఎంపీటీసీ-1 ఓలేటి ధర్మారావు, ఓలేటి బాపూజీ, కామాది నందం తదితరులు ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో గురువారం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శుక్రవారం ఉదయం మళ్లీ టీడీపీని వదిలి వైసీపీలో చేరారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠకు నేటితో తెరపడింది. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అయితే.. రఘురామ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఒకవేళ బరిలో ఉంటే లోక్‌సభకా..? అసెంబ్లీకా ..? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ‘కూటమి నుంచి పక్కా బరిలో ఉంటా. రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది’ అని అన్న రఘురామకు ఏ టికెట్ ఇస్తారో వేచి చూడాలి.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో కాకినాడ రూరల్ ఏర్పాటైంది. కాగా ఈ నియోజకవర్గంలో తొలిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురసాల కన్నబాబు PRP నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో పిల్లి అనంతలక్ష్మి TDP నుంచి, 2019లో కురసాల కన్నబాబు YCP నుంచి గెలుపొందారు. ఇలా జరిగిన 3 ఎన్నికల్లో 3 వేర్వేరు పార్టీలు గెలుపొందాయి. మరి ఈ సారి ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
తూ.గో. జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన పుల్లలపాడుకు చెందిన కొవ్వూరి రాణి (51)కి 4 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయం కాగా రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. 2రోజుల తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. కాగా విశాఖ షీలానగర్‌లో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఆమె ఊపిరితిత్తులను, మూత్రపిండాలను కుటుంబీకుల అనుమతితో దానం చేశారు. ఈ మేరకు కుటుంబీకులను పలువురు అభినందించారు.
Sorry, no posts matched your criteria.