EastGodavari

News March 25, 2024

తల్లి వార్డుమెంబర్.. కుమార్తె MLA అభ్యర్థి

image

ఉమ్మడి తూ.గో జిల్లా రంపచోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీష బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి కృష్ణవేణి ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం గింజర్తిలో వార్డు మెంబర్‌గా ఉన్నారు. 3ఏళ్లుగా ఈ పదవిలో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. కోయదొర సామాజిక వర్గం(ఎస్టీ)కు చెందిన శిరీష నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. శిరీష వయసు 30ఏళ్లు మాత్రమే. TDP అభ్యర్థుల్లో ఈమె పిన్న వయస్కురాలు.

News March 25, 2024

గ్రేట్.. ‘కిలిమంజారో’పై కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిణి

image

ఉన్నత ఉద్యోగం.. బిజీ షెడ్యూల్.. అయినా పర్వతారోహణపై ఆసక్తితో ఆఫ్రికాలోనే అతి ఎత్తైన కిలిమంజారోను అధిరోహించారు కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిణి ఎస్.భరణి. ఈమె స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. 9Th క్లాస్‌లో కొడైకెనాల్‌కు స్టడీటూర్‌ వెళ్లగా.. అక్కడి కొండలు, సరస్సులు చూశాకే తనకు కొండలెక్కాలన్న ఆసక్తి మొదలైందని భరణి చెబుతున్నారు. ఈమె 2018లో ఫారెస్ట్ ఆఫీసర్ నరేంద్రన్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

News March 25, 2024

కాకినాడలో వ్యభిచార గృహంపై దాడి.. కేసు

image

కాకినాడ పట్టణ పోలీసులు ఆదివారం ఓ వ్యభిచార గృహంపై దాడిచేసి యువతి, నలుగురు వ్యక్తులతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జె.రామారావుపేటలోని జెండాసెంటర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. విటులు, ఓ యువతి, నిర్వాహకులను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రూ.6,735 నగదు, 7 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

News March 25, 2024

తూ.గో జిల్లాలో విస్తృతంగా ఉపాధి పనులు

image

తూ.గో జిల్లాలో ఉపాధిహామి పనులు విస్తృతంగా చేపడుతున్నట్లు డ్వామా పీడీ ఎం.ముఖలింగం తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. జనవరి నెల వరకూ కూలీలకు బిల్లులు అందజేశామని అన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ఈ పథకం అమలుపై గ్రామ స్థాయి నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందడం లేదన్నారు. కూలీలతో పాటు, మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు వివరించారు.

News March 25, 2024

రాజమండ్రి: ‘ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి’

image

రాజకీయ పార్టీలు కచ్చితంగా ఎన్నికల నిబంధనలను పాటించాలని రూరల్ నియోజకవర్గ ఆర్వో తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షోలు, ర్యాలీలు, సభలు, మైక్‌లో ప్రచారం చేసుకునే విషయంలో 48 గంటల ముందుగా ఎన్నికల అధికారి నుండి అనుమతి తీసుకోవాలన్నారు. అందుకోసం సువిధ యాప్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలు ఆర్వో కార్యాలయంలో అందచేయాలని పేర్కొన్నారు.

News March 24, 2024

గోదారి జిల్లాల్లో 10 స్థానాల్లో జనసేన.. FINAL

image

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 21 చోట్ల పోటీ చేయనుండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 అభ్యర్థులను ప్రకటిస్తూ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పి.గన్నవరం టికెట్ మొదట టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ చివరికి ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. పోలవరం సీటు సైతం చివరివరకు సందిగ్ధత ఉండగా..చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు అవకాశం వచ్చింది. మొత్తంగా గోదారి జిల్లాలు జనసేనకు కీలకం కానుండగా ఓటరు ఎటువైపో..?

News March 24, 2024

పిఠాపురం: పవన్ కళ్యాణ్‌ను కలిసిన వర్మ

image

పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. వర్మను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకులు సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.  

News March 24, 2024

తూ.గో: ‘కూటమి’ లెక్క తేలింది.. TDP-15, JSP-6

image

ఉమ్మడి తూ.గో 21 నియోజకవర్గాల్లో TDP-జనసేన-BJP కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 15, జనసేన 6చోట్ల పోటీ చేస్తుండగా.. BJP నుంచి ఎవరూ లేరు. పి.గన్నవరం టికెట్ ముందుగా TDPకి కేటాయించగా.. కొన్ని పరిణామాలతో జనసేనకు వెళ్లింది. వైసీపీ కూడా ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో నేతలంతా ఇక ప్రచారం రంగంలోకి దిగనున్నారు. ‘కూటమి’ Vs వైసీపీగా మారిన ఈ పోటీలో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి.

News March 24, 2024

రైలు కింద పడబోయిన మహిళ.. కాపాడిన పోలీసులు

image

కుటుంబ కలహాల కారణంగా కుమారుడితో కలిసి రైలు కింద పడబోయిన మహిళను రైల్వే పోలీసులు కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా తునిలోని ఓ కాలనీకి చెందిన మహిళ.. తన 4ఏళ్ల కుమారుడిని తీసుకెళ్లి రైలు పట్టాలపై నిలబడింది. కానిస్టేబుల్స్ శ్రీనివాస్‌, మోహనరావు గమనించి వారిని రక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి.. భర్తను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఇంటికి పంపినట్లు ఎస్సై తెలిపారు.

News March 24, 2024

ప్రత్యర్థులుగా రిటైర్డ్ ఉన్నత ఉద్యోగులు!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ‘కూటమి’ టికెట్‌పై సందిగ్ధత తొలగింది. ముందు TDP నుంచి రాజేశ్‌కు టికెట్ దక్కగా.. అసమ్మతి నేపథ్యంలో ఆ టికెట్ జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. విప్పర్తి ఇరిగేషన్ శాఖలో.. గిడ్డి పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. వీరిద్దరూ తొలిసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.