EastGodavari

News March 31, 2024

తూ.గో.: ఉదయం టీడీపీలోకి.. సాయంత్రం వైసీపీలోకి

image

అమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో ఆదివారం ఉదయం స్థానిక ఏ.వేమవరప్పాడుకు ప్రభాకర్ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. అయితే సాయంత్రానికి వారు వైసీపీలో చేరారు. వారు మాట్లాడుతూ.. ఇష్టం లేని పార్టీలో తాము ఉండలేమంటూ వైసీపీలో చేరారు. జడ్పీటీసీ పందిరి హరి, సర్పంచ్ విజయ సమక్షంలో వైసీపీలో చేరారు. మంత్రి విశ్వరూప్ విజయానికి కృషి చేస్తామన్నారు.

News March 31, 2024

తూ.గో.: విహార యాత్రలో విషాదం

image

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం పొల్లూరు జలపాతంలో తూ.గో. జిల్లా వాసి మృతి చెందాడు. వివరాలు ఇలా.. ఆదివారం సెలవు కావడంతో రంగంపేట మండలం సింగంపల్లికి చెందిన కొందరు మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతానికి వెళ్లారు. వారిలో కొండయ్య(33) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. దీంతో స్నేహితులు హుటాహుటిన బయటకు తీసి మోతుగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 31, 2024

తూ.గో. జిల్లాలో తొలిసారి బరిలో.. గెలిచి నిలిచేనా..?

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలోని 19స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తొలిసారి పోటీచేస్తున్నవారు 9 మంది ఉండటం విశేషం. జనసేన నుంచి బత్తుల రామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, YCP నుంచి పిల్లి సూర్యప్రకాశ్, TDP నుంచి యనమల దివ్య, వాసంశెట్టి సుభాష్, మిర్యాల శిరీష, ఆదిరెడ్డి వాసు, BJP- శివకృష్ణంరాజు ఉన్నారు. గెలిస్తే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

News March 31, 2024

DAY-2.. శ్రీపాద వల్లభ సంస్థానంలో జనసేనాని

image

కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేనానికి శ్రీ వల్లభ సంస్థానం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అర్చక స్వాములు పవన్‌తో పూజలు చేయించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 2వ రోజు ప్రచారంలో భాగంగా పవన్ బయలుదేరగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారికి పవన్ అభివాదం చేశారు.

News March 31, 2024

RRR పోటీపై సందిగ్ధత.. క్యాడర్‌లోనూ క్లారిటీ మిస్!

image

MP రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో ప.గో జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ BJP అభ్యర్థిగా శ్రీనివాసవర్మను అధిష్ఠానం ప్రకటించినప్పటికీ RRR మాత్రం తానే బరిలో ఉంటానని, ఇక్కడ MPగా కాకుంటే ప.గోలోనే MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. అటు BJP నేతలు వర్మనే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. దీంతో RRR వర్గంతో పాటు కూటమి క్యాడర్‌లోనూ క్లారిటీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

News March 31, 2024

రాజమండ్రి: ‘ఈసీ ఆంక్షలు చంద్రబాబు చేసిన కుట్రే’

image

జగనన్నను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు సేవలందించేందుకు ముందుకు వచ్చిన యువత వాలంటీర్లుగా పనిచేస్తుంటే టీడీపీ- జనసేన నేతలు వేధింపులకు గురిచేస్తున్నారని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించడం చంద్రబాబు చేసిన కుట్రే అన్నారు.
– ఎంపీ వ్యాఖ్యలపై మీరేమంటారు..?

News March 30, 2024

తూ.గో.: 9 మంది వాలంటీర్ల రాజీనామా

image

తూ.గో. జిల్లా కడియం మండలంలో 9 మంది గ్రామ వాలంటీర్లు వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు కడియం ఎంపీడీవో జి.రాజ్ మనోజ్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీరిలో ఏడుగురు కడియం, మిగిలిన ఇద్దరు కడియపులంక గ్రామానికి చెందిన వారు ఉన్నారన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు వారు చెప్పారని ఎంపీడీవో తెలిపారు.

News March 30, 2024

పిఠాపురం: వర్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న పవన్‌కళ్యాణ్

image

పిఠాపురం నుండి MLA అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్మ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్‌ని ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం వర్మ తల్లి అలివేలు మంగ పద్మావతి ఆశీర్వాదం తీసుకున్నారు.

News March 30, 2024

తూ.గో.: CM సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన ఇన్‌ఛార్జి

image

కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ శనివారం వైసీపీలో చేరారు. అనంతపురం జిల్లాలో సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పర్యటించిన సీఎం జగన్‌ను పితాని బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పితాని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా జగన్ ఓదార్చారు. ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ పాల్గొన్నారు.

News March 30, 2024

తూ.గో: వేసవి ప్రారంభంలోనే భానుడి భగభగలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ఆఖరు నాటికే సుమారు 35-38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రమై ప్రయాణికులు, పనులకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.