India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికే సుమారు 35 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత అధికం కావడంతో భానుడి భగభగలు మిన్నంటుతున్నాయి. ఈ వేసవి సీజన్ ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు మూడు డిగ్రీల వరకూ అధికంగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తుంది.
చంద్రబాబే కాబోయే సీఎం అని బల్ల గుద్ది చెబున్నానని MP రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఛాన్సే లేదు. కూటమి టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ మంచి మిత్రుడు. పార్టీకి ఆయన చేసిన సేవ వల్లే టికెట్ పొందారు. దిల్లీ పెద్దలు సర్వే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఏమైనా జరగొచ్చు. నాకు న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా’నని స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో రబీ వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 2,204 హెక్టార్లలో పూర్తవడం ద్వారా 4శాతం లక్ష్యాన్ని రైతులు సాధించారు. రాజానగరం మండలం మరింత పురోగతి సాధిస్తూ 1,000 హెక్టార్లలో పూర్తయి 30 శాతానికి చేరువైంది. వారం పది రోజుల వ్యవధిలో వరి కోతలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు లబ్ధి చేకూర్చాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. తొలిరోజు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో పవన్ దిగనున్నారు. అక్కడి నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం, అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. అనంతరం దొంతమూరులో TDP మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ నివాసానికి వెళ్లి ఆయనను పలకరిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు చేబ్రోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తల్లి సత్యవతి అనపర్తి ప్రజలను ఉద్దేశించి శుక్రవారం ఓ కరపత్రం విడుదల చేశారు. తన భర్త మూలారెడ్డి, కుమారుడు రామకృష్ణారెడ్డి టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషిచేశారన్నారు. అధికార పార్టీ తమ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇప్పుడు టీడీపీ ఇచ్చిన టికెట్‌ను కాదని అన్యాయం చేస్తుందని, తమకు ప్రజలే మద్దతుగా నిలవాలన్నారు.
రాజేష్ మహాసేన సోషల్ మీడియోలో పెట్టిన పోస్ట్‌పై ఆసక్తి నెలకొంది. ‘తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, పార్టీ మారుతానని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2019లో జగన్ కోసం పని చేసి మోసం పోయాం. తర్వాత జనసేన కోసం కష్టపడ్డా అవకాశం రాలేదు. TDP నుంచి అనివార్య కారణాలతో అవకాశం కోల్పోయాం. అందుకే ‘మహాసేన’ చెప్పినట్లు చేయాలనుకుంటున్నా. అదేంటో APR 1న తెలిజయేస్తా’ అని రాసుకొచ్చారు. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.
కాకినాడ జిల్లా పిఠాపురంలో రేపు ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. ఈ సభతోనే జనసేన అధినేత పవన్ ప్రచారం షురూ కానుంది. SAT 12.30 PMకు పవన్ గొల్లప్రోలు హెలిప్యాడ్‌లో దిగుతారు. పాదగయలో పూజలు.. పొన్నాడలోని బషీర్ బీబీ దర్గా దర్శనం.. పిఠాపురంలోని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం 4.30 PMకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం నుంచి ప్రచారాన్ని ఎన్నికల మొదలు పెట్టనున్నారు.
కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.
కాకినాడలోని ఉప్పలంక వద్ద వాహన తనిఖీలు చేస్తోన్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్‌పై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకొని కరప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రచారం, ప్రకటన ప్రదర్శన నిర్వహించడంలో స్థానిక సంస్థల పరిధికి లోబడి, భద్రతాపరమైన అంశాల నేపథ్యాన్ని అనుసరించి మాత్రమే అనుమతులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. స్థానికంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శించే హోర్డింగుల విషయంలో స్థానిక సంస్థలకు చెందిన చట్టాలను అనుసరించే అనుమతుల మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.