India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమలాపురం రూరల్ మండలం సమనసకు చెందిన వాలంటీర్లు మోకా వెంకన్నబాబు, ఉడుముల ప్రసాదరావును విధుల నుంచి తొలగించారు. వీరిద్దరూ కామనగరువులో ఈ నెల 27న వైసీపీ నేతలతో కలిసి క్రైస్తవ మత ప్రచారంలో విద్యార్థులకు బైబిల్ పంపిణీలో పాల్గొన్న కారణంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్లిపాడు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృత్యువాత పడినట్లు ఎస్సై అబ్దుల్ మారూప్ తెలిపారు. మృతుడు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు నుంచి జారిపడి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉంచామని పోలీసులు తెలిపారు.
కాకినాడ కలెక్టర్‌గా జే.నివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్‌గా పని చేస్తున్న కృత్తికా శుక్లాను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కృత్తికా శుక్లా గత రెండేళ్లుగా కాకినాడ కలెక్టర్‌గా సేవలు అందించారు. వైద్యారోగ్య శాఖలో డైరెక్టర్‌గా ఉన్న జె.నివాస్‌ను కృతికా శుక్లా స్థానంలో కలెక్టర్‌గా నియమించారు.
కూటమి అభ్యర్థి శివకృష్ణం రాజు టికెట్ వివాదంపై స్పందించారు. పొత్తులో భాగంగా సీటు ఏ పార్టీకి వచ్చినా అందరూ కలసి సహకరించుకుని ఎన్నికల్లో పోటీ చేయడం పొత్తు ధర్మం అన్నారు. త్వరలో నల్లమిల్లి రామక్రిష్ణ రెడ్డితో పాటు జనసేన నేతలను కలసి మద్ధతు అడుగుతానని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్తానన్నారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో సామర్లకోటకు చెందిన కొరిపల్లి సంజయ్ (26) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై యాదగిరి బుధవారం తెలిపారు. ఇతను సంజయ్ దివిస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని చెప్పారు. పరిశ్రమ క్వార్టర్స్ లో ఉండే అతను నెల రోజుల క్రితం స్నేహితులు అద్దెకు ఉండే గదికి మారాడన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.
మండలంలోని చక్రద్వారబంధం గ్రామంలో సుమ రిఫైనరీ పామాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఆయిల్ ముడిసరుకు బాయిలర్ శుభ్రం చేయడానికి మరమ్మతులు చేస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని యాజమాన్యం తెలిపారు.
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తెలిపారు. బీఈడీ రెండేళ్ల కాలవ్యవధి కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు హాజరు కావాలని కోరారు. రెగ్యులర్ సీట్లు 14, ఈడబ్ల్యూఎస్ 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. తప్పనిసరిగా ఏపీ ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలన్నారు.
బీజేపీ అనపర్తి MLA అభ్యర్థి శివరామకృష్ణంరాజు బిక్కవోలు మండలం రంగాపురంలో 1986 జులై 22న జన్మించారు. 16 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ స్థాయిలో పనిచేశారు. పదవీ విరమణ చేసిన రాజు RSSలో ప్రచార ప్రముఖ్‌గా పని చేశారు. అనంతరం BJPలో చేరి మండల అధ్యక్షుడిగా, జిల్లా మీడియా ప్యానలిస్టుగా వ్యవహరించారు. ప్రస్తుతం అనపర్తి BJP కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి రామరాజు 1982 నుంచి BJP సభ్యుడు.
85 ఏళ్లు పైబడిన వృద్ధులు, నడవలేని దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృత్తికా శుక్లా బుధవారం తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంపొందించే దిశగా ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. మొబైల్ వాహనం సాయంతో ఇంటి వద్దే వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయవచ్చన్నారు.
ఎట్టకేలకు అనపర్తి MLA టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన ఆ పార్టీ నేత ములగపాటి శివరామకృష్ణం రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. టీడీపీ తొలి జాబితాలో అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. తర్వాత బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. సోము వీర్రాజు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు రాజుకే టికెట్ దక్కింది.
Sorry, no posts matched your criteria.