India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ సముద్రతీరంలో నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డును మూసివేస్తున్నట్లు గ్రామీణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. వాహనాలను తిమ్మాపురం అచ్చంపేట కూడలి నుంచి పిఠాపురం మళ్లిస్తున్నామని.. వాహనదారులు, గ్రామస్థులు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు.
తూ.గో. జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మలపల్లి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తుమ్మలపల్లి గతంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పలుమార్లు పోటీలో నిలిచారు. కాగా ఈ నెల 30వ తేదీన పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి తూ.గో. జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు తెలిపారు. స్త్రీ, పురుషుల విభాగంలో జట్ల ఎంపిక ఉంటుందన్నారు. అమలాపురం జడ్పీ పాఠశాలలో ఆరోజు ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన వారు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలతో రావాలని ఆయన సూచించారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రైళ్లను పూర్తిగా, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో పట్టాల మరమ్మతుల కారణంగా విశాఖపట్నం- మచిలీపట్నం, గుంటూరు- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 4 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. రామవరప్పాడు- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
తూ.గో. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జవహర్ నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, రాష్ట్రాధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నరసాపురం పార్లమెంటు సీటు వెంటనే టీడీపీ కేటాయించాలని డిమాండ్ చేస్తూ RRR ఆర్మీ ఆధ్వర్యంలో అమలాపురంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిలో నరసాపురం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దంతులూరి శ్రీనివాసరాజు, చిలువూరి సతీష్ రాజు, దెందుకూరి సత్తిబాబు, తదితరులు ఉన్నారు.
రాజమండ్రి రూరల్ జై భీమ్‌రావ్ భారత్ పార్టీ MLA అభ్యర్థిగా నాంబత్తుల రాజుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ నియమించినట్లు తెలిపారు. సామాన్యుడికి MLA టికెట్ రావడం పట్ల పలువురు సామాజిక వ్యక్తులు, ఉద్యమ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచి తీరతానని అన్నారు.
రాజవొమ్మంగి మండలం మారేడుబాక గ్రామానికి చెందిన చిట్టోజి లోవరాజుకి 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చిందని జడ్డంగి ఎస్సై రఘునాథరావు తెలిపారు. 2018 ఆగస్టు 3వ తేదీన అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై నిందితుడు లైంగిక దాడికి యత్నించగా.. బాలిక ప్రతిఘటించడంతో కత్తితో దాడిచేసి గాయపరిచాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార శంఖారావానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 30న పిఠాపురంలోని శ్రీపురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, ‘వారాహి’కి పూజలు చేసి ప్రచారం మొదలు పెట్టనున్నారు. 3 విడతల్లో పవన్ ప్రచారం సాగనుంది. మొదటి 3 రోజులు పిఠాపురంలోనే ఉండి సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత జనసేన బరిలో ఉన్న ప్రాంతాలకు ప్రచారానికి వెళ్తారు. ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే జరుపుకోనున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.