India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈసారి TDP అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు మన అమలాపురం నుంచే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయనే గంటి హరీశ్ మాధుర్(33). 12వ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి-మాజీ ఎంపీ విజయకుమారి దంపతుల కుమారుడు హరీశ్‌కు అమలాపురం ఎంపీ టికెట్ ఖరారైంది. స్వగ్రామం ఐ.పోలవరం మండలం ఎదుర్లంక. BBM చదివిన ఈయన.. 2019లోనూ ఇక్కడే MPగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి మళ్లీ ఆయనే టికెట్ దక్కించుకున్నారు.
ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజులపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. వారాహి వాహనంపై పర్యటన ఉండేలా ఏర్పాట్లకు సిద్ధం కావాలన్నారు. టూర్ మేనేజ్మెంట్, టీం కన్వీనర్లు, కో కన్వీనర్లతో ఎన్నికల ప్రచారంపై చర్చించారు. ఈ మేరకు గొల్లప్రోలులో అనుమతి సైతం తీసుకున్నారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యాపారానికి TDP నేతలే డాన్‌లనే విషయం విశాఖ పోర్టు ఘటన ద్వారా తేటతెల్లమైందని రాజమండ్రి సిటీ వైసీపీ MLA అభ్యర్థి భరత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూనం కోటయ్య చౌదరి, వీరభద్రరావు కొకైన్ కేసులో కీలకమని తెలుస్తోందన్నారు. విశాఖపోర్టులో 25వేల కిలోల డ్రైఈస్ట్‌తో కలగలిపి కొకైన్‌ను అధికారులు గుర్తించారన్నారు. పట్టుబడిన వారు టీడీపీ నేత లోకేష్‌కు, బాలకృష్ణ వియ్యంకుడన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గానికి ‘పర్వత’ కుటుంబం ఐదుగురు MLAలను అందించింది. 1955లో పర్వత గుర్రాజు గెలవగా, ఆయన వారసుడు పర్వత సుబ్బారావు 1994లో గెలిచారు. సుబ్బారావు భార్య బాపనమ్మ 1999లో విజయం సాధించారు. ఆమె కుమారుడు పర్వత సత్యన్నారాయణ మూర్తి 2009లో గెలుపొందారు. అదే కుటుంబం నుంచి పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌కి 2019లో విజయం దక్కింది. దీంతో ఆ కుటుంబం నుంచి ఐదుగురు నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయింది.
టీడీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీశ్ మాధుర్ పోటీ చేయనున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. హరీశ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈయన జీఎంసీ బాలయోగి కుమారుడు.
టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. అమలాపురం MLA అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ సిటీ MLA అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావును అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. అమలాపురంలో వైసీపీ అభ్యర్థి పినిపె విశ్వరూప్.. కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా.. 2019లోనూ ఈ రెండు చోట్ల వీరే ప్రత్యర్థులు కాగా, ఈసారి ఎవరు నెగ్గుతారో చూడాలి.
ప్రపంచంలో ఏ మూలనున్నా సొంతూరు రాజకీయాలపై ఉండే ఆసక్తే వేరు. ఐదేళ్లకోసారొచ్చే ఎన్నికల పండక్కి ఎలాగైనా వచ్చి ఓటేస్తుంటారు NRI ఓటర్లు. ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,006 మంది NRI ఓటర్లు ఉంటే.. పురుషులు-790, స్త్రీలు- 215, థర్డ్ జెండర్ ఒకరు ఉన్నారు. తూ.గో జిల్లాలో 442, కాకినాడ-292, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 272 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమండ్రి నుంచి అధికంగా 173 మంది ఉంటే.. తుని నుంచి ముగ్గురు ఉన్నారు.
తూ.గో జిల్లాలో పలు భద్రతా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గౌరవం దక్కింది. ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రం గురువారం రాత్రి విడుదల చేశారు. డీసీఆర్బీలో పనిచేస్తున్న ఏఎస్‌ఐ బీవీఆర్ వర్మకు ఉత్తమ సేవా పథకం లభించింది. ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ జే.శ్రీనివాసరావు, కొవ్వూరు పీఎస్‌లో పనిచేస్తున్న హెచ్‌సీ కె.శ్రీనివాసరావు, ఉండ్రాజవరం పీఎస్‌లోని హెచ్‌సీ వై.నాగేశ్వరరావు ఉన్నారు.
జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను మే 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ ఛైర్మన్, ఉప కులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు గురువారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత షెడ్యూల్ ను సవరించినట్లు పేర్కొన్నారు. సెట్ కు సంబంధించి సందేహాలు ఉంటే 0884 2359599, 0884 2342499 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
ఇటీవల వైసీపీలో చేరిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వారు ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో తన గెలుపు కోసం సహకరించాలని ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేను కోరారు.
Sorry, no posts matched your criteria.