EastGodavari

News March 17, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,513 కేసులు పరిష్కారం

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో 64 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,513 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.2.30 కోట్ల నష్టపరిహారం అందజేశారు.

News March 17, 2024

కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ప్రచారం.. 19న సభ

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 19వ తేదీన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో నిర్వహించనున్న వైసీపీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. స్థానిక ఆకుల వీర్రాజు విగ్రహం వద్ద మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుందని కొత్తపేట MLA, వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.

News March 17, 2024

ఫ్లెక్సీలు ధ్వంసం చేశారని డీఎస్పీకి ఫిర్యాదు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు పరిధిలోగల మన్నా జూబ్లీచర్చ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సంఘం నాయకులు డీఎస్పీ ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్చ్‌ పాస్టర్‌ అల్లవరం పోలీస్‌లకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పాస్టర్లు డీఎస్పీని కోరారు.

News March 16, 2024

అమలాపురంలో మళ్లీ మొసలి ప్రత్యక్షం

image

అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన కాలువలో శనివారం మొసలి ప్రత్యక్షం అయింది. మొసలిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలువను ఆనుకునే గృహాలు ఉండటంతో చుట్టుపక్కల వారంతా ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతానికి దగ్గరలోనే అధికారులు మొసలిని పట్టుకున్నారు. ఇప్పుడు మరో మొసలి ప్రత్యక్షమైంది.

News March 16, 2024

తూ.గో.: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.