India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ సతీశ్ కుమార్ చెప్పారు. వివిధ పార్టీల నాయకులతో బుధవారం ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజున చిన్న చిన్న ఘటనలు జరిగాయని, లెక్కింపు సందర్భంగా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైవే పెట్రోలింగ్ సిబ్బంది రావులపాలెం వైపు గస్తీ నిర్వహిస్తుండగా సిద్ధాంతం బ్రిడ్జిపై సుమారు 45 ఏళ్ల మహిళ గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించారు. గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రాజబాబు, దుర్గారావు, విజయ చందర్ వెంటనే చేరుకుని ఆ మహిళను అతి కష్టం మీద ఆపగలిగారు. ఆ మహిళను తమ వెంటబెట్టుకుని రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు బ్రిడ్జిపై జరిగిన సంఘటన వివరించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు తూ.గో జిల్లాలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరగనున్నందున ఆ రోజు ఎక్కడా బాణసంచా కాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నామన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
జనసేన గెలుపు కోసం ప్రచారం చేసిన పార్టీ వీరమహిళల సేవలు మరువలేనివని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ లేక విడుదల చేశారు. ‘పిఠాపురంలో నా తరఫున ఆడపడుచులు చేసిన ప్రచారం, అందించిన తోడ్పాటుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రతిఒక్కరినీ గుర్తించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, వారిని బలమైన మహిళా నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాను’ అని పవన్ లేఖలో పేర్కొన్నారు.
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ధాన్యం లోడు చేస్తుండగా ఈనెల 14వ తేదీన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో గాయపడిన చిలకలపూడి సురేష్ (35) కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు అక్కడికక్కడే నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.
ఉమ్మడి తూ.గో.లోని 19నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 14 చోట్ల గెలిచింది. 4 స్థానాల్లో టీడీపీ, ఒకచోట (రాజోలు) జనసేన పాగా వేసింది. తాజాగా పిఠాపురం నుంచి పవన్ పోటీచేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. కాగా పొత్తులో భాగంగా జనసేన ఈ సారి 5 చోట్ల పోటీచేసింది. మరి గతంలో జనసేన గెలిసిన ఏకైక స్థానం ఈ జిల్లాలోనే కాగా.. ఈ సారి సీట్లు పెరిగేనా.?
– ఉమ్మడి తూ.గో.లో కూటమికి ఎన్నిసీట్లు రావొచ్చు..?
ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన భీమేంద్ర గొల్లవిల్లికి చెందిన లలిత(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరచూ వీరిమధ్య గొడవలు జరుగుతుండగా సోమవారం ఆమె ఉరేసుకొని చనిపోయింది. అల్లుడు వివాహేతర సంబంధాలు పెట్టుకొని తన కూతురిని చంపేశాడని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు SI మనోహర్ జోషి తెలిపారు.
కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఓ మహిళ రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ట్రైన్ వస్తుండగా పట్టాలపై ఓ మహిళ పరిగెత్తడంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ లోవరాజు తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా హింసాత్మక ఘటనలకు అవకాశం అంటూ వస్తున్న అసత్య ప్రచారాలు తగవని కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. లెక్కింపు రోజు, ఫలితాల తర్వాత కాకినాడ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న సందేశాల్లో ఏమాత్రం నిజం లేదని ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం అమరవిల్లికి చెందిన బోరా దుర్గ (38) మంగళవారం గ్రామ శివారులోని ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుర్గకు కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్నారు. ప్రియుడితో గొడవలు పడిందని, అతడు ఆమె తలపై కొట్టాడని తెలుస్తుంది. దుర్గకు భర్త, పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.