India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొవ్వూరు మాజీ MLA పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణ బాబు) మంగళవారం మృతి చెందారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఆయన స్వగృహంలో మృతిచెందారు. తణుకు, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేతగా పేరుగాంచిన కృష్ణ బాబు తదనంతర కాలంలో వైసీపీలో చేరారు. పారిశ్రామికవేత్తగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణబాబు విశేష సేవలు అందించారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. చేబ్రోలు ఆదర్శ్ ఇంజినీరింగ్ కళాశాలలో కోనేటి రాజా నరేంద్ర(21) బీటెక్ సీఎస్‌ఈ విభాగంలో థర్డ్‌ఈయర్ చదువుతున్నాడు. కాగా మొదటి రెండు సంవత్సరాలు ఇంజినీరింగ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఈ నెల 4న కళాశాల వెనుక ఉన్న జీడిమామిడి తోటలో పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.
వృద్ధురాలిపై(60) అత్యాచారం జరిగిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. SI బాలాజీ వివరాల ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన ఓ వృద్ధురాలిపై స్థానికంగా ఓ రైతు దగ్గర పనిచేస్తున్న యువకుడు, అతని స్నేహితుడు కలిసి అత్యాచారం చేశారు. బాధితురాలు ఆమె కొడుకుతో విషయం చెప్పింది. విచారించగా సామర్లకోటకు చెందిన కోట శేఖర్, ఏవీ నగరానికి చెందిన కాలిబోయిన గంగాధర్‌గా తెలిసింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.
చాట్ బోట్, సీఈఐఆర్ ద్వారా ఇప్పటివరకు రూ.2.52 కోట్ల విలువ చేసే 1393 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. పలు విడతలుగా కేసులు చేధిస్తూ.. బాధితులను గుర్తించి వాటిని అందించామన్నారు. ఈమేరకు సోమవారం స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లు గుర్తించమన్నారు.
జీవ వైవిధ్య, పర్యావరణ విలువలు పాటిస్తున్న రాజమండ్రి సెంట్రల్ జైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు తరఫున ‘బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవార్డు’కు ఎంపికైనట్లు జైలు పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న జరిగే అంతర్జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు అందుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం రైలు నుంచి జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తుని రైల్వే ఎస్సై అబ్దుల్ మారూప్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నీలం రంగు జీన్స్ ప్యాంట్, గులాబీ రంగు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపర్చినట్లు తెలిపారు. సంబంధీకులు ఉంటే తుని రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సాయంత్రం పిడుగులు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, బిక్కవోలు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఫోన్లకు మెసేజ్‌లు పంపారు.
తుని పట్టణ రైల్వే స్టేషన్‌లో సోమవారం సినీ హీరో సాయిరాం శంకర్ సందడి చేశారు. నర్సీపట్నంకు చెందిన పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలో తుని రైల్వే స్టేషన్‌లో కనిపించారు. 143 చిత్రంతో పాటు పలు చిత్రాలలో ఆయన నటించారు. తుని రైల్వే స్టేషన్‌లో ఆయనను చూసి పలువురు సెల్ఫీలు దిగారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గోకవరం పంచాయతీ పరిధి గిరిజనాపురం గ్రామస్థులు తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో మొత్తం 50 మంది ఉండగా.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత 19మందికి తొలిసారి ఓటుహక్కు వచ్చింది. 12 కుటుంబాలకు చెందిన వీరు కొండదిగువన 4కి.మీ. దూరంలో వేములపాలెం పోలింగ్ బూత్‌లో ఓటేశారు. తమకు ఓటుహక్కు రావడంతో రాజకీయ నాయకులు సైతం తొలిసారి ప్రచారం చేశారని చెబుతున్నారు.
తూ.గో. జిల్లా అడ్డతీగల మండలం దగ్గర తిమ్మాపురం పంచాయతీ పరిధి గడిచిన్నంపాలేనికి సరైన రహదారి లేక గ్రామస్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామానికి చెందిన పెంటరావు అనారోగ్యంతో చికిత్సపొందుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని వాహనంలో తీసుకొద్దామంటే గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక ఎడ్లబండిలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.