India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్నవరం సత్యదేవుడి కళ్యాణోత్సవాల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణ ధారణ, దీక్షా వస్త్రధారణ జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి మంగళ సూత్రాలు, చుట్లు, స్వామికి స్వర్ణ యజ్ఞోపవేతాలను మేళతాళాల మధ్య గ్రామంలో విశ్వబ్రాహ్మణుల నుంచి తీసుకు వస్తారు. రాత్రి 7 గంటలకు స్వామిని వెండి గరుడ వాహనంపై, అమ్మవారిని గజవాహనంపై, పెళ్లి పెద్దలైన సీతారాములను వెండి పల్లకీలో ఊరేగిస్తారు.
సత్య దేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్య కళ్యాణం ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానుంది. వీఐపీలు, భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో అలంకరణ చేయనున్నారు. కొండ దిగువ నుంచి కొండపైకి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట మధ్య ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్- వైజాగ్ వారియర్స్‌కు కాకినాడ జిల్లా క్రీడాకారుడు పెంకె మణికంఠ గంగాధర్ ఎంపికయ్యాడు. సామర్లకోటలోని వీరరాఘవపురానికి చెందిన గంగాధర్ క్రికెట్‌లో మంచి ఆటతీరు కనబర్చడంతో ప్రీమియర్ వైజాగ్ వారియర్స్‌కు ఎంపిక చేసినట్లు క్రికెట్ సంఘం నేతలు వివరించారు. మణికంఠ ఎంపిక పట్ల జిల్లా క్రీడా సంఘం అధ్యక్షులు శివకుమార్, కార్యదర్శి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గంగాధర్‌కు అభినందనలు తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం రావులపాలెం వద్ద గౌతమి గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరొక యువకుడు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టగా.. ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల నేపథ్యంలో తూ.గో కలెక్టర్ సూచనల మేరకు నన్నయ విశ్వవిద్యాలయంలో రోజువారి కార్యక్రమాలను జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు వీసీ కె.పద్మరాజు తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న కారణంగా క్యాంపస్‌ను ‘నో మ్యాన్ జోన్’గా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని వీసీ కోరారు.
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర శనివారం ఉదయం ఆకాశంలో ఆహ్లాదకరమైన వాతావరణ దృశ్యం కనిపించింది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడ ఒక్కసారిగా మారిన వాతావరణం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆకాశంలో ఎరుపు వర్ణంతో మేఘాలు, కింద వరి పొలాలు కనువిందుగా దర్శనమిచ్చాయి. ఆ అందాలను భక్తులు సెల్‌ఫోన్లతో ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు.
కోడిగుడ్డు ధర పెరిగింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.7కు విక్రయం జరుగుతోంది. ప్రస్తుతం ధర పెరిగినప్పటికీ రైతుల నుంచి రూ.5కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 300 పౌల్ట్రీలు ఉన్నాయి. దాదాపు 1.40 కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుంది. రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కోడిగుడ్డుకు నికరంగా రూ.6 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజుల పాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ.రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. అయితే దీనిపై హైకోర్టు స్టే ఉన్నందున తదుపరి విచారణ జూన్ 21వ తేదీకి వాయిదా వేసింది. YS.జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన శ్రీనుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో శుక్రవారం ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కాకినాడ జేఎన్టీయూ ఉపకులపతి ప్రసాదరావు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 20,256 మంది పరీక్షకు హాజరుకాగా.. 1995 మంది గైర్హాజరు అయినట్టు తెలిపారు. కాకినాడ జిల్లాలో ఫార్మసీ విభాగానికి సంబంధించి 920 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.