India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో జిల్లా అనపర్తిలో నకిలీ నోట్ల చెలామణి కలకలం రేపింది. ఫేక్ నోట్స్ మార్కెట్‌లోకి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు నోట్లు, నకిలీ నోట్లు గుర్తించలేని విధంగా ఏ మాత్రం అనుమానం రాకుండా చేతులు మారుతున్నాయట. రూ.100, రూ.200, రూ.500 నకిలీ నోట్లు విపరీతంగా చెలామణి అవుతున్నాయని పలువురు వాపోతున్నారు. డబ్బు చూస్తేనే దుకాణదారులు భయపడుతున్నారు. బడ్డీ కొట్లు, చిన్న దుకాణదారులు వాటికి బలవుతున్నారు.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడులో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లమిల్లి సత్తిరాజు కుమారుడు కృష్ణప్రసాద్ HYDలో ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఓటింగ్ కోసం స్వగ్రామానికి వచ్చిన కృష్ణప్రసాద్.. ఈ రోజు మామిడికాయలు కోయడానికి చెట్టెక్కాడు. కాయలు కోస్తున్న క్రమంలో గుండెపోటు రాగా పైనుంచి రాయిపై పడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద 216వ నంబర్ జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడని ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన బర్రె నాగరాజు (21) బైక్‌పై రావులపాలెం నుంచి మూలస్థాన అగ్రహారం వైపు వస్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని రెండు నగరాల్లో ఓటర్ల చైతన్యంలో కాకినాడ ప్రథమ స్థానంలో నిలిచింది. కాకినాడలో అత్యధికంగా 72.16% పోలింగ్ జరిగింది. రాజమహేంద్రవరంలో 67.57% పోలింగ్ నమోదైంది. ఈ రెండు నగరాల్లో ఓటింగ్ శాతం గతం కంటే పెరిగింది. మరోవైపు 9 పట్టణాల్లో మండపేట, పిఠాపురం, నిడదవోలు ముందంజలో నిలిచాయి. మండపేటలో అధికంగా 85.72%, పిఠాపురంలో 83.48%, నిడదవోలులో 82.31% పోలింగ్ జరిగింది.
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రి రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో శనివారం నుంచి 21వ తేదీ వరకు అదనంగా ఒక థర్డ్ ఏసీకోచ్ ఏర్పాటుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- విశాఖపట్నం సికింద్రాబాద్ (12740/12739), సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ (22204/22203) రైళ్లలో ఈ అదనపు ఏసీ కోచ్‌లు ఏర్పాటుచేశామని వివరించారు.
ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పందేలు కాస్తున్నారు. రామచంద్రపురానికి చెందిన ముగ్గురు యువకులు ఓ పార్టీ విజయం సాధిస్తుందని రూ.1.50 లక్షలు పందెం కాయగా, ఎదుటి వ్యక్తి మరో పార్టీది విజయం అంటూ రూ.3 లక్షల రెట్టింపు పందెం వేశారు. కొన్ని చోట్ల మెజారిటీలపైన కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.- మీ వద్ద ఉందా..?
తూ.గో. జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో దారుణ హత్య జరిగింది. SI రామారావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులగం సూర్యనారాయణ రెడ్డి(65) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కాగా బుధవారం గ్రామానికి చెందిన శివారెడ్డి, అతని భార్యను దూషించాడు. దీంతో గురువారం రాత్రి గ్రామ శివారు దూడలపాకలో ఒంటరిగా ఉన్న సూర్యనారాయణరెడ్డిని శివారెడ్డి కర్రతో కొట్టి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.
స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన గురువారం కోనసీమ జిల్లా చెయ్యేరు ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల వద్ద చేపట్టిన భద్రతా చర్యలపై సమీక్షించారు. మూడంచెల భద్రతలో భాగంగా కేంద్ర సాయుధ బలగాలు, సివిల్ పోలీసులను అక్కడ ఉంచామన్నారు. పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. ఎస్పీ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.
జనసేన అధ్యక్షులు పవన్ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి గురువారం ఓ లేఖ విడుదల చేశారు. ‘ఓటర్లు రాత్రి 10 గంటల వరకూ క్యూలైన్‌లో ఉండి రికార్డ్ స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు చేయడం మీ ప్రేమను తెలియజేస్తుంది. తాను పోటీ చేస్తానని తెలియగానే ఎంతో బలమైన కేడర్ ఉన్నప్పటికీ సీట్ త్యాగం చేసిన టీడీపీ ఇన్‌ఛార్జి వర్మసహకారం మరువలేనిది. నా కోసం పని చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలం అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. మొత్తం 2,36,409 మందికి 2,04,811 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.63% పోలింగ్ జరిగింది. గొల్లప్రోలు రూరల్ మండలంలో 86.59 శాతం, నగర పంచాయతీలో 84.99, పిఠాపురం రూరల్ లో 88.62 శాతం, మున్సిపాలిటీలో 83.48 శాతం, యు.కొత్తపల్లిలో 87.35% పోలింగ్ జరిగింది.
Sorry, no posts matched your criteria.