India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రి వైసీపీ నియోజకర్గ అభ్యర్థి, పి.మార్గాని భరత్ రామ్ అత్తింట్లో విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న భరత్ కు మద్దతుగా పనిచేసేందుకు నగరానికి వచ్చిన ఆయన పోలింగ్ ముగిసిన మరుసటి రోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించగా బుధవారం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
ట్రాఫిక్ మరమ్మతుల కారణంగా పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను ఈనెల 26,27 తేదీల వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. రాజమండ్రి-విశాఖపట్నం, రాజమండ్రి-నర్సాపూర్, నిడదవోలు-నరసాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-రాజమండ్రి, విశాఖపట్నం-గుంటూరుతో పాటు మరికొన్నింటిని రద్దు చేశామన్నారు.
తూ.గో. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 9 చోట్ల 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే తాజా ఎన్నికల్లో తక్కువగా నమోదైంది. అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, రంపచోడవరం నియోజకవర్గాల్లో దాదాపు 1 శాతం మేర పోలింగ్ తగ్గింది. మరి ఈ పరిణామం ఏ పార్టీకి దోహదపడుతుందన్న దానిపై ముందస్తుగానే ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు.
– మరి మీ కామెంట్ ఏంటి..?
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఓటింగ్ నమోదైంది. వెరసి గత ఎన్నికల్లో కంటే పోలింగ్ దాదాపు 5 శాతం మేర పెరిగింది. పిఠాపురంలో 2019- 81.26, 2024- 86.63, కాకినాడ సిటీలో 2019 67.09, 2024- 72.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతం అధికంగా పెరిగిన నియోజకవర్గాలు ఇవే కావడం విశేషం.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ ఓటర్లు చైతన్యం చూపారు. మొత్తం 2,45,296 మంది ఓటర్లు ఉండగా.. 1,03,292 మంది పురుషులు, 1,01,476 మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో 83.64 శాతం పోలింగ్ నమోదైంది. అయితే గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 83.64 శాతం ఓటింగ్ నమోదవడం విశేషం.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపుపై జోరుగా పందేలు కాస్తున్నారు. జరిగిన పోలింగ్ ఫలితాల్లో పవన్ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని పలువురు బెట్టింగ్ వేస్తున్నారు. పవన్ గెలిస్తే రూ.లక్ష చెల్లిస్తామని.. ఒకవేళ వైసీపీ అభ్యర్థి గీత విజయం సాధిస్తే రూ.2 లక్షలు చెల్లించాలని ఉమ్మడి పార్టీల నాయకులు చెల్లించాలన్న ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. దీనిపై మీ కామెంట్..
ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఇంకా విజేత ఎవరనేది తెలియాలంటే దాదాపు 20 రోజులు వేచిచూడాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి తూ.గో. జిల్లాలో పలు చోట్ల అభ్యర్థుల గెలుపు ఓటములపై బెట్టింగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఏ గ్రామంలో చూసినా యువత, పెద్దలు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. కాగా మన ఉమ్మడి తూ.గో.లో మొత్తం 19 నియోజకవర్గాలున్నాయి.
– ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందంటారు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ అరెస్ట్ అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఓ లేఖ విడుదల చేశారు. YCP నాయకులే కవ్వింపు చర్యలకు పాల్పడిన సందర్భంలో చోటుచేసుకున్న వివాదంలో హత్యాయత్నం కేసు నమోదు చేయడం రాజకీయ కుట్రలో భాగంగా కనిపిస్తోందన్నారు. న్యాయపరంగా పోరాడతామని లేఖలో పేర్కొన్నారు. కాగా లీలాకృష్ణకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని మొబార్లీపేట జంక్షన్ వద్ద మంగళవారం ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. దుండగులు యువకుడిని కత్తితో నరికి, నాప రాయితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కొనఊపిరితో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడలోని రేచర్లపేట 41వ పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చిన షేక్ అహ్మద్ హున్నీషా అనే మహిళ అస్వస్థతకు గురై మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం అహ్మద్ హున్నీషా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకొని 12.30కి ఓటు వేసింది. అనంతరం ఆయాసం వస్తుందంటూ చెప్పడంతో అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది ఆమెను ఆటోలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.