EastGodavari

News May 14, 2024

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో యువకుడి కిడ్నాప్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంకలో ఓ యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. తన కుమారుడు రేఖపల్లి నాగరాజును కొందరు వ్యక్తులు సోమవారం కిడ్నాప్ చేశారని తండ్రి సూర్యనారాయణ మలికిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత వివాదాలే ఈ కిడ్నాప్‌కు కారణమని యువకుడి తండ్రి చెబుతున్నారు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చేపట్టారు.

News May 14, 2024

కోనసీమ: ఓటు వేశాక ఫిట్స్.. చికిత్స పొందుతూ మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన కర్రి సత్యనారాయణ(52) ఫిట్స్‌తో మృతి చెందాడు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఓటు వేసిన అనంతరం ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే సత్యనారాయణ మృతితో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది.

News May 14, 2024

తాజా అప్‌డేట్: ఉమ్మడి తూ.గో.లో అత్యధిక పోలింగ్ ఇక్కడే

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19% పోలింగ్ నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో 79.31%, కాకినాడ జిల్లాలో 76.37% నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. మండపేటలో అత్యధికంగా 87.50%, అత్యల్పంగా రాజమండ్రి సిటీలో 67.59% పోలింగ్ నమోదైంది.
NOTE: పూర్తి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చు.

News May 14, 2024

తూ.గో.: ఓట్ల పండగ ముగిసింది.. మీరు ఓటేశారా..?

image

ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఓట్ల పండగ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కాగా సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాలో 68.17, కోనసీమ జిల్లాలో 73.55, కాకినాడ జిల్లాలో 65.01 పోలింగ్ నమోదైంది. మరి మీరు ఓటు వేశారా..? మీ వద్ద ఎలా జరిగింది పోలింగ్..?
– కామెంట్ చేయండి.

News May 13, 2024

కాకినాడ: ఓటు వేసిన ఉప్పెన మూవీ డైరెక్టర్

image

కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉప్పెన మూవీ డైరెక్టర్ సానా బుచ్చిబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన స్వస్థలమైన కొత్తపల్లిలో ఓటు వేసినట్లు తెలిపారు. ఓటు హక్కును అందరూ విధిగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్ని పనులున్నా ఈ ఒక్కరోజు మాత్రం పక్కన పెట్టి ఓటు వేయాలని అన్నారు.

News May 13, 2024

తూ.గో : పోలింగ్@9AM.. అత్యధికం, అత్యల్పం ఇక్కడే

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు మినహాయించి మిగతా ఎక్కడా ఎలాంటి అల్లర్లు లేవు. కాగా ఉదయం 9:00 గంటల వరకు తూ.గో జిల్లాలో 8.68 శాతం పోలింగ్ నమోదవగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10.42 శాతం, కాకినాడ జిల్లాలో 7.9 శాతం నమోదైంది. నియోజకవర్గాల్లో చూస్తే.. అత్యధికంగా రంపచోడవరంలో 12.59%, తక్కువగా అనపర్తిలో 6% నమోదైంది.

News May 13, 2024

ఉమ్మడి తూ.గో: పోలింగ్ శాతం@ 9AM

image

అనపర్తి- 6.00%, గోపాలపురం- 9.10%, కొవ్వూరు- 9.75%, నిడదవోలు- 6.20%, రాజమండ్రి సిటీ- 8.50%, రాజమండ్రి రూరల్- 11.0%, రాజానగరం- 9.85%, అమలాపురం- 12.05%, పి.గన్నవరం- 10.85%, కొత్తపేట- 8.35%, మండపేట- 12.00%, ముమ్మిడివరం- 8.26%, రంపచోడవరం- 12,59%, రాజోలు- 9.56%, జగ్గంపేట- 8.73%, కాకినాడ సిటీ- 10.21%, కాకినాడ రూరల్- 7.00%, పెద్దాపురం- 9.35%, పిఠాపురం- 10.02%, ప్రత్తిపాడు- 8.5%, తుని- 10.00%.

News May 13, 2024

పిఠాపురంలో గందరగోళ పరిస్థితి..?

image

కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితి నెలకొందని ఓటర్లు మండిపడుతున్నారు. ఈవీఎంలలో గుర్తులు సరిగా కనిపించడం లేదని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో కనీసం విద్యుత్ సరఫరా లేదని వారు ఆరోపించారు.

News May 13, 2024

రాజవొమ్మంగిలో మోరాయించిన ఈవీఎంలు

image

ఏజెన్సీలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజవొమ్మంగి మండలంలోని 75, 76 పోలింగ్ కేంద్రాలలో ఇప్పటివరకు ఈవీఎంలు మోరాయించడంతో ప్రక్రియ ఆలస్యమైందని, ప్రస్తుతం ఈవీఎంలు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. కొన్ని నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని పోలింగ్ ఆఫీసర్లు వెల్లడించారు.

News May 13, 2024

తూ.గో: నేడే పోలింగ్.. ఈ నంబర్స్ గుర్తుంచుకోండి

image

తూ.గో జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 16,23,149 మంది
☞ పోలింగ్ కేంద్రాలు- 1,577
☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 375
☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18904252540
☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం నంబర్- 1950

error: Content is protected !!