India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూ.గో జిల్లాలో 2014తో పోలిస్తే 2019లో పోలింగ్ శాతం పెరిగింది. 80% నమోదైంది. అత్యధికంగా అనపర్తిలో 87.48%, అతి తక్కువగా రాజమండ్రి సిటీలో 66.34% నమోదైంది. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పగడాలపేట ప్రాంతంలోని 109వ పోలింగ్ కేంద్రంలో 100% పోలింగ్ నమోదవ్వడం గమనార్హం. ఈసారి విదేశాలు, ఇతర పట్టణాల్లో ఉన్నవారు భారీగా తరలివస్తున్నారు. వారంతా ఓటువేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది.
తూ.గో జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.
☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 16,23,149 మంది
☞ పోలింగ్ కేంద్రాలు- 1,577
☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 375
☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18904252540
☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం నంబర్- 1950
కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పరిధిలోకి మగసానితిప్ప దీవిలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌కు ఎన్నికల సామగ్రిని అధికారులు మరపడవపై తరిలించారు. బలుసుతిప్ప నుంచి మగసానితిప్పకు చేరుకోవడానికి ఉప్పుటేరు వెంబడి గోదావరి నదీపాయలో గంటసేపు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో 3,608 బ్యాలెట్ యూనిట్లు, 3,608 కంట్రోల్ యూనిట్లు, 4002 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 3,860 బ్యాలెట్ యూనిట్లు, 3,860 కంట్రోల్ యూనిట్లు, 4,170 వీవీప్యాట్లు వాడుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,040 బ్యాలెట్ యూనిట్లు, 2,040 కంట్రోల్ యూనిట్లు, 2,203 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో ఆలస్యమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు వారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
సార్వాత్రిక ఎన్నికల పోలింగ్ నేడే కావడంతో ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 నియోజకవర్గాలు, 3 ఎంపీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇబ్బంది లేకుండా ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద షామియానాలు, నీటి సదుపాయం, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
– ఓటేద్దాం.. హక్కును రక్షించుకుందాం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం MLA అభ్యర్థిగా పోటీచేస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదుకానందు వల్ల తనకు తానే ఓటు వేసుకోలేని విషయం తెలిసిందే. కాగా ఆయన గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో తన ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అక్కడ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.
రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయతీ కిండంగి గ్రామానికి చెందిన గిరిజనులు ఓటు వేయాలంటే 8 కి.మీ నడవాల్సి ఉంటుంది. కొండపైన ఉన్న ఈ గ్రామంలో మొత్తం 51 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 27 మంది పురుషులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 4 కి.మీ దూరంలో ఉన్న లోదొడ్డి గ్రామానికి వచ్చి తిరిగి వారి గ్రామానికి వెళ్ళాలి. మొత్తం 8కిమీ నడక తప్పదని గ్రామస్తులు తెలిపారు.
గోదావరిలో మునిగి చనిపోయిన ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన ముగ్గురి డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. పల్లూరి సత్యఅనంతలక్ష్మి(40), కప్పిరెడ్డి ఏసమ్మ(60), కర్రీ సునీత శనివారం వాడపల్లి వెంకటేశ్వరాలయానికి గోదావరి పాయలోంచి నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో మడికి వద్ద వాడపల్లిలంక సమీపంలో వారు <<13231697>>నీటిలో మునిగిన సంగతి <<>>తెలిసిందే. మృతదేహాలు లభ్యం కాగా.. SI శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. మరొకరి ఆచూకీ తెలియరాలేదు.
ఉమ్మడి తూ.గోలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. అనపర్తి-87.4, రాజానగరం-87.4, రామచంద్రపురం-87.1, మండపేట-86.9, జగ్గంపేట-85.6, కొత్తపేట-84.4, ముమ్మిడివరం-83.6, తుని-83.2, అమలాపురం-83.1, గన్నవరం- 82.4, పత్తిపాడు-81.3, పిఠాపురం-81.2, పెద్దాపురం-80.6, రాజోలు- 80, రంపచోడవరం-77.4. రాజమండ్రి రూరల్-74.2, కాకినాడ రూరల్-74, కాకినాడ సిటీ-67, రాజమండ్రి సిటీ-66.2. ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.