India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చిలకలపాడు నుంచి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి కాలినడకన వస్తుండగా.. గౌతమి గోదావరిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకలపాడుకు చెందిన మహిళలుగా స్థానికులు గుర్తించారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆదివారం అక్కడ పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎలక్షన్ విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురయ్యారు. గంగవరం మండలం బియ్యంపాలెం ఎంపీపీ స్కూల్ టీచర్ తమన్నదొర శనివారం సాయంత్రం తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో పాడేరు వెళ్తున్నారు. అడ్డతీగల మండలం వీరభద్రాపురం సమీపంలో తమన్నదొరకు ఫిట్స్ రాగా.. స్థానిక యూటీఎఫ్ నాయకులు ఆర్వో ప్రశాంత్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. అధికారుల అనుమతితో ఇంటికి చేర్చారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులుగా తూ.గో జిల్లాలోని సాధారణ ప్రజలకు దొరికిన ఉపాధికి ఈ వారాంతంలో బ్రేక్ పడింది. అభ్యర్థులు తమ ప్రచారాల కోసం గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలను సమీకరించారు. కూలి చెల్లించి తమ వెంట తిప్పుకున్నారు. పూల వ్యాపారులతో మొదలై, టెంట్లు, టీ, టిఫిన్ సెంటర్లకు సైతం తాజా ఎన్నికల నేపథ్యంలో కొంత ఆదాయం లభించింది. ప్రచార పర్వానికి తెరపడటంతో ఇప్పుడు ఆ ఉపాధికి బ్రేక్ పడింది.
తూ.గో జిల్లా కడియం మండలం కడియపుసావరంలో శనివారం రాత్రి ఓ వ్యక్తి నగదు పంపిణీ చేస్తున్నాడని స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. సీఐ తులసీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి పరిశీలించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.64 వేలు స్వాధీనం చేసుకుని, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తూ.గో. జిల్లాలో గత 2 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 78.5 శాతం పోలింగ్ జరగగా.. 2019 ఎన్నికల్లో 80.08 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో మరింత పెంచేలా ఓటర్లుగా
మనం ముందుకెళ్దాం.
– ఇంతకీ గత 2 ఎన్నికల్లో మీరు ఓటు వేశారా..?
రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నేటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 22 రోజులకే ఫలితాలు. ఉమ్మడి తూ.గో.లో 19 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 234 మంది (నామినేషన్లు) పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్‌తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి.
కాకినాడ సిటీలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కాకినాడ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నీ సంగతి చూస్తా.. నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టావు, ప్రకృతి వనరులను దోచేశావు, పచ్చని మడ అడవులను నరికేశావ్.. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి నిన్ను రోడ్డుమీదికి లాక్కొస్తాం’ అంటూ ఫైర్ అయ్యారు.
పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ CM చేసి పంపిస్తానని CM జగన్ అన్నారు. పిఠాపురం సభలో ఆయన మాట్లాడుతూ.. గాజువాక, భీమవరం అయిపోయింది ఇప్పుడు పిఠాపురం వచ్చిన వ్యక్తికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందా అంటూ పవన్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పిఠాపురం చేరుకున్నారు. ప్రచారంలో చివరి సభ కావడంతో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ నేపథ్యంలో ఆయనపై ఏమైనా విమర్శలు చేస్తారా అన్నదానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.