India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితమే కైకలూరులో పర్యటించి అక్కడి నుంచి పిఠాపురం బయలుదేరారు. జనసేన అధినేత పవన్ పిఠాపురం నుంచే బరిలో ఉండటం, జగన్ ప్రచార ముగింపు సభ కావడంతో సీఎం ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. పిఠాపురంలో క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. పూజల అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.
– మన తూ.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో తూ.గో. జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. మరోవైపు జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీచేయడంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.
ఏపీలోనే పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ ఇక్కడ పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి ఓడిపోయారు. అదే రిజల్ట్ ఈసారి పిఠాపురంలోనూ రిపీట్ చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌కు మద్దతుగా సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుండగా.. సీఎం జగన్ తన ప్రచారాన్ని పిఠాపురంలో ముగించనున్నట్లు సమాచారం. సీఎం ఫిన్షింగ్ టచ్ ఇస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే భావనలో ఉన్నారట.
అభం శుభం తెలియని శిశువు మృతదేహం మురుగు కాలువలో లభ్యం కావడం స్థానికులను కలచి వేసింది. రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆర్యాపురం ప్రధాన మురుగు కాలువలో మగ శిశువు మృతదేహం కనిపించడంతో పోలీసులు బయటకు తీయించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా బొడ్డుతాడు కూడా తీయని శిశువు మృతదేహాన్ని కాలువలో పడేశారని, దీనిపై విచారణ చేపట్టామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఒక వైపు ఎన్నికలు.. మరొక వైపు సెలవులు కావడంతో ఆర్టీసీతో పాటు రైల్వేలలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉమ్మడి తూ.గో జిల్లాకు చెందిన వేల మంది హైదరాబాదులో ఉపాధి పొందుతున్నారు. అక్కడి నుంచి స్వస్థలాలకు వచ్చేందుకు రైల్వేతో పాటు ఆర్టీసీలోనూ టిక్కెట్లు దొరకని పరిస్థితి. ఈ నెల 11, 12, 13 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండనుంది. HYD నుంచి రాజమహేంద్రవరానికి నిత్యం 4 సర్వీసులు నడుస్తుండగా.. మరో 3 ఏర్పాటు చేశారు.
పిఠాపురం నియోజకవర్గంలో నేడు పవన్ రోడ్ షో ఇలా సాగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు చిత్రాడ-జగ్గయ్యచెరువు, పాదగయ, పశువుల సంత, గొల్లప్రోలు పట్టణం, చేబ్రోలు గెస్ట్‌హౌస్ వరకు రోడ్ షో సాగనుంది. సాయంత్రం ఏకే మల్లవరం, కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్, ఎస్‌ఈజెడ్ కాలనీ, కొత్తపల్లి, యండపల్లి, కొండెవరం, పిఠాపురం బంగారమ్మ రావిచెట్టు కూడలి వరకు ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో రెండు నగరాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలున్నాయి . ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువ. అన్ని విధాలా చైతన్యం కలిగిన జిల్లా. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ పెద్దగా పోలింగ్ జరగడంలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 74.64శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2019లో 79శాతం పోలింగ్ జరిగింది. ఈ సారి కనీసం 85 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రలోభాలకు తెరలేచినట్లు తెలుస్తోంది. కొత్తపేటలో చీరలు, వెండి నాణేలు.. రాజమండ్రిలో ఓటుకు రూ.2,500.. కాకినాడ, పెద్దాపురం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తిలో రూ.2వేలు.. తుని, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజానగరం, పి.గన్నవరం, రాజోలులో రూ.1500.. జగ్గంపేటలో రూ.1000 చొప్పున ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో ఏకంగా రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పంచుతున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.